'యాపిల్' సీఈవో గా ఎలాన్ మస్క్ .... వివాదం రేపిన తాజా పుస్తకం

Update: 2021-08-03 11:30 GMT
వ్యాపార లావాదేవీలు, వ్యవహార శైలితోనే కాదు వివాదాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌. అయితే మరో దిగ్గజ కంపెనీ సీఈవో చేతిలో మస్క్‌ ఘోర అవమానం పాలయ్యాడనే వార్త ఇప్పుడు సిలికాన్‌ వ్యాలీ లో జోరుగా షికార్లు కొడుతోంది. ఇంతకీ మస్క్‌ ను బండ బూతులు తిట్టింది ఎవరో కాదట యాపిల్‌ సీఈవో టిక్‌ కుక్‌. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ యాపిల్ కు సీఈవో అవ్వాలనుకున్నారా, టెస్లాను యాపిల్ కు అమ్మే ప్రయత్నం చేశారా, అంటే వాల్ స్ట్రీట్ జర్నల్ కు చెందిన టిమ్ హిగిన్స్ అనే జర్నలిస్ట్ అవుననే అంటున్నాడు.

తాను రాసిన పవర్ ప్లే: టెస్లా, ఎలాన్ మస్క్ అండ్ ద బెట్ ఆఫ్ ద సెంచరీ అనే పుస్తకంలో ఆ వివరాలను పేర్కొన్నాడు. టెస్లాను యాపిల్ టేకోవర్ చేసే విషయంపై మస్క్, యాపిల్ సీఈవో టిమ్ కుక్ మధ్య చర్చలు నడిచాయని పేర్కొన్నాడు. తాజాగా ప్రచురితమైన ఈ పుస్తకంలో కుక్, మస్క్ లు ఫోన్ లో మాట్లాడుకున్నారని రచయిత పేర్కొన్నాడు. టెస్లా మోడల్ 3 కారును విడుదల చేసినప్పుడు సమస్యలు ఎదురయ్యాయని, దాని గురించి కుక్, మస్క్ మాట్లాడుకున్నారని చెప్పాడు. అయితే, టెస్లాను యాపిల్ కు అమ్మాల్సిందిగా మస్క్ కు కుక్ ప్రతిపాదించారని అందులో తెలిపాడు. దానికి మస్క్ ఒప్పుకొన్నా ఓ షరతు పెట్టారని, తనను టెస్లాకు కాకుండా యాపిల్ కు సీఈవోగా చేస్తే అమ్మేందుకు సిద్ధమని అన్నారని తెలిపాడు.

దాంతో కోప్పడ్డ కుక్, మస్క్ ను తిట్టి, వెంటనే ఫోన్ పెట్టేశారని పుస్తకంలో రచయిత పేర్కొన్నాడు. దీనిపై మస్క్ తాజాగా స్పందిస్తూ, పుస్తకంలోని రాతలను ఆయన కొట్టిపారేశారు. తామిద్దరి మధ్య ఎప్పుడూ ఎలాంటి చర్చ జరగలేదని, తాము ఫోన్ లో గానీ, ఉత్తరాల ద్వారాగానీ మాట్లాడుకోనేలేదని స్పష్టం చేశారు. అసలు తాను టెస్లాను అమ్మాలనుకోలేదని, తాను యాపిల్ సీఈవో కావాలనుకోలేదని ట్వీట్ చేశారు. అప్పట్లో టెస్లా విలువ ఇప్పుడున్న దాంట్లో కేవలం ఆరు శాతమేనన్నారు. ఇక, తాను మస్క్ తో ఎప్పుడూ మాట్లాడలేదని ఇటీవలి ఇంటర్వ్యూలో టిమ్ కుక్ కూడా స్పష్టం చేశారు. ఆయన సంస్థపై తనకు ఎంతో అభిమానం ఉందన్నారు.

ఆ టైంకి టెస్లా విలువ.. ఇప్పుడున్న విలువలో 6 శాతం మాత్రమే ఉంది. బహుశా అందుకే ఆయనకి (కుక్‌) ఆసక్తి లేకపోయి ఉండొచ్చు. నాన్‌ సెన్స్‌, ఇలాంటి వాళ్ల రాతలు పనికి మాలినవి అంటూ హిగ్గిన్స్‌ పై మండిపడ్డాడు ఎలన్‌ మస్క్‌. ఇదిలా ఉంటే మోడల్‌ ఎక్స్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయిన తర్వాత టెస్లా ఘోరమైన ఆర్థిక నష్టాల్ని చవిచూసింది. దీంతో 2016లో 60 బిలియన్‌ డాలర్ల ఒప్పందంతో యాపిల్‌కు టెస్లాను అమ్మే ప్రయత్నం చేశాడు మస్క్‌. అయితే ఆ డీల్‌ టైంలో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణంలోనే ఏదో జరిగిందనే వార్తని ఆనాడు ప్రముఖ మీడియా హౌజ్‌ లు అన్నీ ప్రకటించాయి. అయితే ఆనాడు జరిగింది ఇదేనంటూ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ హగ్గిన్స్‌ ఆ ఫోన్‌ సంభాషణను బయటపెట్టడం ఇప్పుడు కార్పొరేట్‌ రంగంలో చర్చనీయాంశంగా మారింది.



Tags:    

Similar News