ఎలన్ మస్క్ ఈగో విలువ 100 మిలియన్ డాలర్లు

Update: 2022-10-30 01:30 GMT
ట్విట్టర్ ను టేకోవర్ చేసిన ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ ఇప్పుడు అందులో తనకు ఎదురుతిరిగిన సీఈవో, సీఎఫ్ఓ సహా కీలక ఉన్నతాధికారులను వచ్చిన రోజే ఉద్వాసన పలికారు. ఆయన ఇగోకు నచ్చని భారతీయ సీఈవో పరాగ్ అగర్వాల్ ను పక్కనపెట్టారు. అయితే మస్క్ ఇగో ఖరీదు ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 100 మిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో 741 కోట్ల రూపాయలు పైమాటే..  ఎలోన్ మస్క్‌కి అది పెద్ద డబ్బు కాకపోవచ్చు కానీ ఆయన ఇగో వల్ల ఇప్పుడు ట్విట్టర్ సంస్థ ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ఎలన్ మస్క్ ట్విట్టర్ ను కొన్నాక అందులోని నలుగురు నలుగురు టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. దీని వలన ట్విట్టర్‌కు వారిని తీసివేస్తే పరిహారంగా ఇవ్వాల్సిన చెల్లింపుల రూపంలో $100 మిలియన్లు (రూ. 7,415,622,000 INR) ఖర్చు అవుతుంది.

ట్విట్టర్   సీఈవో.. భారతీయ సంతతికి చెందిన టెక్కీ పరాగ్ అగర్వాల్ ను ఈ సోషల్ మీడియా కంపెనీలో బాధ్యతలు చేపట్టిన 12 నెలల్లోపు తొలగించబడితే $42 మిలియన్లను పరిహారంగా చెల్లించాలని ఒప్పందంలో ఉంది.  యాదృచ్ఛికంగా 2021కి అగర్వాల్ మొత్తం పరిహారం $30.4 మిలియన్లు, వీటిలో ఎక్కువ భాగం స్టాక్ షేర్ గా ఉంది. . ఇంతలో ఇక మరో అధికారి సెగల్‌ను తొలగించినందుకు $25.4 మిలియన్ చెల్లించబడుతుంది. లీగల్ హెడ్ గాడ్డే $12.5 మిలియన్లు ,  చీఫ్ కస్టమర్ ఆఫీసర్ సారా పెర్సోనెట్ $11.2 మిలియన్లు తొలగించినందుకు పరిహారంగా పొందనున్నారు.

ట్విట్టర్ కొత్త యజమాని ఎలన్ మస్క్ కొత్తగా కొనుగోలు చేసిన కార్యాలయంలోకి వెళ్లినప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు.  అతని ఉద్దేశ్యం ఏమిటంటే తనే ఈ ట్విట్టర్ కు 'బాస్' అని.. దానిని అందరూ అర్థం చేసుకోవాలని అతను కోరుకున్నాడు.

ప్రారంభంలోనే మస్క్ ట్విట్టర్ లో కీలక నిర్ణయాలు తీసుకునేది తానేనని స్పష్టం చేశాడు. హింసను ఆశ్రయించకుండా ప్రజలు విషయాలు మాట్లాడగలిగే స్వేచ్ఛా మార్కెట్  ను నెలకొల్పుతానంటూ ప్రకటించాడు.

అంతా బాగానే ఉన్నా ఇప్పుడున్న అధికారులను తొలగించడం ద్వారా దాదాపు 100 మిలియన్ డాలర్లను వారికి ఊట్టిపుణ్యానికే పరిహారంగా చెల్లించడమే మస్క్ కు, ట్విట్టర్ కు పెనుభారం అవుతుంది. అయినా కూడా మస్క్ మొండిపట్టుదలతో ఇదంతా చేస్తున్నాడని అర్థమవుతోంది. మస్క్ ఇగో విలువ 100 కోట్లు అని సోషల్ మీడియాలో జనాలు ఆడిపోసుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News