టెక్ ప్రపంచం రారాజు ఎలన్ మస్క్‌కి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. అది కూడా సొంత ప్రాజెక్టు సోలార్ సిటీ నుంచే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తుంది. సోలార్ సిటీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్న మస్క్ అందులో మేజర్ షేర్ హోల్డర్ గా ఉన్నారు. అయితే భారీ అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఒక ఇన్వెస్టర్ ఎలన్ మస్క్ మీద కోర్టుకు ఎక్కారు. ఆ ఆరోపణలు రుజువైతే 9.4 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 70 వేల కోట్లదాకా) భారీ జరిమానా ఎలన్ మస్క్ చెల్లించాలి.
సోలార్ సిటీకి సంబంధించిన ఒక ఇన్వెస్టర్ ఎలన్‌మస్క్‌కు వ్యతిరేకంగా కాలిఫోర్నియా కోర్టులో దావా వేశారు. ఎలన్ మస్క్ షేర్ హోల్డర్స్ అభిప్రాయాలు, అనుమతి లేకుండానే సుమారు 2.6 బిలియన్ డాలర్ల డీల్ ఒకటి కుదుర్చుకున్నాడని ఆ ఇన్వెస్టర్ ఆరోపిస్తున్నారు. అలాగే కంపెనీలో షేర్ హోల్డర్స్ ప్రాధాన్యం తగ్గించడమేకాకుండా, లాభాలన్నీ కూడా ఎలన్ మస్క్ తన ఖాతాలోనే వేసుకుంటున్నాడని దావా వేసిన షేర్‌హోల్డర్ పేర్కొన్నారు. అంతేకాదు ఆ ఇన్వెస్టర్ దావాకు మిగతా షేర్ హోల్డర్స్‌లో కొందరు మద్దతు ప్రకటించారు.
ఇక ఆ ఇన్వెస్టర్ చెప్పిందంతా రుజువులతో నిజమైతే మాత్రం ఎలన్‌మస్క్ 9.4 బిలియన్ డాలర్ల జరిమానా అంటే దాదాపు రూ.70 వేల కోట్లదాకా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అయితే గతంలో సోలార్ సిటీలో ఎలన్ మస్క్ స్టాక్ షేర్ 2.4 మిలియన్‌గా ఉండేది. స్టాక్స్ పంపకం తర్వాత ఇప్పుడది 12 మిలియన్ కు చేరుకుంది. దీంతో ఎలన్ మస్క్ షేర్ విలువ 9.56 బిలియన్ డాలర్లగా ఉంది. టెస్లా సీఈవో హోదాలో ఉండి అన్నివ్యవహారాల్లో ఎలాగైతే ఎలన్ మస్క్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడో.. అలాగే సోలార్ సిటీ స్టాక్ హోల్డర్స్ ను మస్క్ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాడట.
దీంతో 2017లో టెస్లా షేర్ హోల్డర్స్ అంతా కలిసి మస్క్ మీద దావా కూడా వేశారు. అంతేకాదు కంపెనీలో తన కుటుంబ సభ్యుల్ని మాత్రమే ప్రోత్సహించడం, అధిక వాటాను తానే లాగేసుకోవడం, సమర్థవంతులందరినీ పక్కకు తోసేయడం లాంటివి కూడా ఎలన్ మస్క్ చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్ని ప్రోత్సహించడం, అధిక వాటాను లాగేసుకోవడం, సమర్థవంతులను పక్కకు తోసేయడం లాంటివి చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి మస్క్‌పై. అయితే మస్క్ సంపాదన తప్పుడు దోవలో లేదని, 85 శాతం షేర్ హోల్డర్స్ ఈ ఆర్జనను ఆమోదిస్తున్నారని మస్క్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు.