ట్విటర్ లో సమూల మార్పులకు ఎలన్ మస్క్ శ్రీకారం చుట్టారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు కారణాలతో గతంలో నిలిపివేసిన ఖాతాలకు 'క్షమాభిక్ష' పెడుతున్నట్లు ప్రకటించారు. వచ్చేవారం నుంచే ఆ ఖాతాల పునరుద్ధరణ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు ట్విటర్ లో వెల్లడించారు. ట్విటర్ లో నిలిపివేసిన ఖాతాలకు 'క్షమాభిక్ష' పెట్టాలా? వద్దా? అన్న దానిపై ఎలన్ మస్క్ గురువారం పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్ 31.6 లక్షల మంది పాల్గొన్నారు.
72.4 శాతం మంది అనుకూలంగా ఓటెయ్యగా.. 27.6 శాతం మంది వ్యతిరేకించారు. అత్యధిక మంది క్షమాభిక్షకు ఓకే చెప్పడంతో మస్క్ ఆ ఖాతాలను పునరుద్దరించేందుకు సిద్ధమయ్యారు. 'ప్రజలే న్యాయ నిర్ణేతలు.. వచ్చేవారం నుంచి ఈ క్షమాభిక్ష మొదలవుతుంది. ప్రజల మాటే.. దేవుడి మాట ' అని ఎలన్ మస్క్ నేడు ట్వీట్ చేశారు. విద్వేషపూరిత పోస్టులు లేదా నకిలీ సమాచార వ్యాప్తి తదితర కారణాలతో గతంలో పలువురి ఖాతాలను ట్విటర్ నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఇందులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే ట్విటర్ ను మస్క్ హస్తగతం చేసుకున్న తర్వాత.. ఆ ఖాతాలను పునరుద్ధరిస్తారని ఊహాగానాలు వచ్చాయి. అన్నట్లుగానే ఇటీవల.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించేందుకు పోలింగ్ పెట్టారు. మెజార్టీ నెటిజన్లు అనుకూలంగా ఓటెయ్యడంతో ఆయన ఖాతాను మళ్లీ యాక్టివ్ లోకి తెచ్చారు.
ట్విటర్ లో వేలమంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మస్క్ కు కొత్త చిక్కులు మొదలయ్యాయి. వీటిని పరిష్కరించేందుకు ఆయన కొత్త వారిని నియమించుకుంటున్నారు. తాజాగా ట్విటర్ సెర్చ్ లో తలెత్తిన సమస్యను సరిచేసేందుకు జార్జ్ హాట్జ్ అనే వ్యక్తిని నియమించినట్లు సమాచారం. 2007లో ఐఫోన్ హ్యాక్ చేసిన తొలి వ్యక్తిగా జార్జ్ హోట్జ్ పాపులర్ అయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.