వేలానికి ట్విట్టర్ 'పక్షి'.. ధర ఎంతంటే?

Update: 2023-01-19 07:30 GMT
ట్విట్టర్ కొనుగోలుకు ముందు ప్రపంచ కుబేరుడిగా గుర్తింపు పొందిన ఎలాన్ మాస్క్ ఆ తర్వాత రెండో స్థానానికి పడిపోయాడు. ప్రపంచంలోనే అతిపెద్ద డీల్ గా ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం నడించింది. అయితే ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ చేపడుతున్న చర్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఎలాన్ మస్క్ కు స్పేస్ ఎక్స్.. టెస్లా కంపెనీలు అచ్చి వచ్చినట్టు ట్విట్టర్ మాత్రం కలిసి రావడం లేదు. ఈ కంపెనీ కొనుగోలు తర్వాత ఎలాన్ మస్క్ తన ఆస్తులను భారీ మొత్తంలో కోల్పోవడమే కాకుండా ప్రతిష్టను దిగజార్చుకుంటున్నాడు. ట్విట్టర్లోని ఉద్యోగులను భారీగా తొలగించిన ఎలన్ మస్క్ పొదుపు మంత్రం పేరుతో అనేక సంస్కరణలు చేపడుతున్నాడు.

తాజాగా ట్విట్టర్ కు సంబంధించిన ఆస్తులను ఎలన్ మస్క్ వేలానికి పెట్టడానికి చర్చనీయాంశంగా మారింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలోని పక్షి విగ్రహం.. ఇతర ఆస్తులను వేలంపాటలో ఉంచారు. ఈ విషయాన్ని వేలం నిర్వహణ సంస్థ హెరిటేజ్ గ్లోబల్ పార్టనర్స్ వెబ్ సైట్ ధృవీకరించింది.

ట్విట్టర్లో సంవత్సరానికి ఆహార సేవ కోసం 13 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ఎలన్ మస్క్ వెల్లడించిన తర్వాత కంపెనీలోని 265 కిచెన్ ఉపకరణాలు.. ఇతర ఫర్నీచర్ లను ఆన్ లైన్ వేలంలో విక్రయిస్తున్నట్లు పేర్కొంది. ఈ వేలం బిడ్డింగ్ కేవలం 25 డాలర్ల నుంచి ప్రారంభం అవుతుందని హెరిటేజ్ గ్లోబల్ పార్టనర్స్ వెబ్ సైట్ పేర్కొంది.

కంపెనీలోని నియాన్ ట్విట్టర్ బర్డ్ లైట్ ఎలక్ట్రికల్ డిస్‌ప్లే ధర కేవలం 22వేల 500 డాలర్లుగా ఉంది. ఇది వేలం వేయడానికి కేవలం 10 గంటల లోపు మాత్రమే ఉంది. అలాగే 190 సెం.మీ ప్లాంటర్ ధర 8 వేల డాలర్లుగా ఉంది. నీలి రంగు పక్షి విగ్రహం ధర ప్రస్తుతం 20 వేల 500 డాలర్లుగా పలుకుతోంది.

అలాగే ఈ వేలంలో కొన్ని కిచెన్ ఉపకరణాలు ఉన్నాయి. వీటిలో అనేక హై-ఎండ్ లా మార్జోకో ఎస్ప్రెస్సో మెషీన్లు.. ఐస్ డిస్పెన్సర్‌తో కూడిన ఫిజీ డ్రింక్ ఫౌంటెన్లు ఉన్నాయి. ఒక జత హెర్మన్ మిల్లర్ కాఫీ టేబుళ్లను కూడా ఆఫ్‌లోడ్ చేశారు. దీని ధర ప్రస్తుతం 2వేల200 డాలర్లుగా ఉంది.

కాగా గత వారం శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి అద్దె చెల్లించడంలో ఎలన్ మస్క్ విఫలమయ్యారు. ఆఫీస్ స్పేస్ కోసం $136,250 అద్దె చెల్లించడంలో విఫలమైనందున దావా వేయబడింది. దీంతో ఈ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులంతా రిమోట్ సెన్సింగ్ విధానంలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు.. ఢిల్లీ.. ముంబైలోని తన కో-వర్కింగ్ స్థలాలను ట్విట్టర్ తొలగించాలని చూస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News