ప్రపంచ ప్రఖ్యాత విద్యుత్ వాహనాల (ఈవీ) కంపెనీ 'టెస్లా’ ఇప్పటికే అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ఎలక్ట్రిక్ కార్లతో అమెరికన్ మార్కెట్ ను షేక్ చేస్తోంది. విద్యుత్ వాహన రంగం ఇప్పుడు అమెరికా సహా పాశ్చాత్య దేశాల్లో ఉవ్వెత్తున సాగుతోంది. ఇదే ఊపులో ప్రపంచంలోనే అపర కుబేరుడు.. టెస్లా అధినేత భారత్ వంటి వర్ధమాన దేశాల్లో కూడా తన పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని చూస్తున్నారు.ఈ మేరకు దరఖాస్తు చేసుకోగా.. భారత ప్రభుత్వం కండీషన్లతో టెస్లా వెనక్కి తగ్గుతోంది.
ఇక దేశంలో విద్యుత్ వాహనాల రంగంలో స్వదేశీ కంపెనీల వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ తరుణంలో భారత్ లో టెస్లా కు ప్రత్యేక ప్రోత్సాహకాలను మంజూరు చేయడం దేశ ప్రయోజనాలకు అంత మంచిది కాదని దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ ఓలా వ్యవస్తాపకుడు భవీష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
సాఫ్ట్ బ్యాంక్-మద్దతుగల ఓలా.. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, హ్యుందాయ్ సహా మరికొన్ని ఇతర కంపెనీలతో కలిసి స్థానికంగా బ్యాటరీ సెల్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్రప్రభుత్వ 2.4 బిలియన్ల డాలర్ల ప్రోగ్రామ్ కింద ఇటీవల టెండర్ ను గెలుచుకుంది.
భారత్ లో టెస్లా తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుకోవచ్చు. కానీ వారు ప్రత్యేక ప్రయోజనాలు ఆశిస్తున్నారు. ఇది దేశ ప్రయోజనాలకు అంతమంచిది కాదని నేను విశ్వసిస్తున్నానని అగర్వాల్ అన్నారు. మరోవైపు మార్చిలో ఒక స్కూటర్ లో మంటలు చెలరేగడంతో ఓలా తమ 1400 స్కూటర్ల బ్యాచ్ ను రీకాల్ చేసింది.
ఇక టెస్లా ఇప్పటివరకూ భారత్ లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. అయితే ఆ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ మాత్రం తమ కార్ల విక్రయాలు, సర్వీసింగ్ కు ముందు అనుమతి ఇవ్వని దేశాల్లో తయారీని ప్రారంభించబోమని మేనెలలో తేల్చిచెప్పారు.
చైనాలో టెస్లా వాహనాలు సక్సెస్ అయ్యాయి. ఆ దేశంలో విద్యుత్ వాహనాలు పుంజుకోవడానికి దోహదపడింది. దీంతో చైనా పలు పన్ను మినహాయింపులు ఇచ్చింది. భారత్ లో కూడా మస్క్ ఈ తరహా ప్రయోజనాలను ఆశిస్తున్నారు. టెస్లా వస్తే తమ కొంపు మునుగుతుందని దేశీయ ఎలక్ట్రిక్ వాహన యజమానులు ఆందోళన చెందుతూ అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.