74 ఏళ్ల వయసులోనూ దుమ్ము లేపేస్తున్న మాయా మస్క్

Update: 2022-05-19 03:13 GMT
ఎప్పటికప్పుడు తన సంచలన ట్వీట్స్ తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటూ ఉంటారు.. టెస్లా అధినేత, ప్రపంచ నంబర్ 1 కోటీశ్వరుడు ఎలాన్ మస్క్. ప్రస్తుతం 3,30,000 కోట్ల రూపాయలతో ట్విట్టర్ కొనుగోలుకు సిద్దమవుతున్నారు.. ఎలాన్ మస్క్.

ఇదే కోవలో ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్ కూడా చేరిపోయారు. తన కుమారుడు ఎలాన్ మస్క్ మాదిరిగానే అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్నారు. అందులోనూ 74 ఏళ్ల వయసు వచ్చినా మాయే మస్క్ తగ్గడం లేదు.

ఇంతకు మాయే మస్క్ ఏమి చేసిందనేగా మీ సందేహం? హాయిగా కృష్ణా రామా అనుకుంటూ కూర్చోవాల్సిన వయసులో మాయా మస్క్ సంచలనాలకు కేంద్రంగా మారారు. 74 ఏళ్ల వయసులో బికినీ ధరించి దుమ్ము లేపేశారు.

స్పోర్ట్స్ ఇలస్ట్రీటేడ్ మాగజైన్ కవర్ పేజీకి దుమ్ము లేపే పోజులు ఇచ్చారు. అందులోనూ 74 ఏళ్ల వయసులో టూ పీస్ బికినీతో మాయే మస్క్ ఇచ్చిన పోజులు అందరినీ ఆమె వైపు తిప్పేలా చేశాయి. మొత్తం నలుగురు మహిళలు ఈ మాగజైన్ కవర్ కోసం బికినీల్లో దర్శనమిచ్చారు. వారిలో మాయే మస్క్.. ఒకరు.

వివిధ రకాల టూ పీస్ బికినీ ల్లో మాయే మస్క్ అందరినీ ఆకట్టుకున్నారు. ఇలా బికినీ ధరించి మాగజైన్ కవర్ మీద కనిపించడం ఆమెకు ఇది మొదటిసారి కాదు. గతంలో 69 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా మాయే మస్క్ బికినీ ధరించి పోజులిచ్చారు. అప్పుడు ఆమె నగ్నంగా కనిపించడం విశేషం.

ఇటీవల ఎలాన్ మస్క్ కూడా ఒక ఫ్యాషన్ షోలో రెడ్ కార్పెట్ మీద నడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో మాయే మస్క్ కూడా చేరిపోయారు. వయసుతో పని లేదని.. ఈ వయసులోనూ ఇష్టమైన పనితో నేను ఎంతో ఆనందిస్తున్నా అని మాయా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మరోవైపు నెటిజన్ల నుంచి ఆమె ఫోటోలకు భారీ స్పందన వస్తోంది. లైకులు, ట్వీట్స్, రిట్వీట్స్, షేర్లతో సందడి చేస్తున్నారు.
Tags:    

Similar News