ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ ఇటీవల ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొని అందరికీ షాకిచ్చాడు. ఏకంగా 44 బిలియన్ డాలర్లకు హస్తగతం చేసుకున్నాడు. ఒక్కో షేరుకు 54.20 డాలర్లకు కొన్నాడు. ట్విట్టర్ కొన్న తర్వాత తన తదుపరి టార్గెట్ ఏంటో ప్రకటించాడు.
ఎలన్ మస్క్ తాజా ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. తన తదుపరి లక్ష్యం కోకాకోలాను కొనడమేనని ఎలన్ మస్క్ చెప్పుకొచ్చాడు. అందులోకి ఇల్లీగల్ డ్రగ్ గా పేరున్న కొకైన్ ను కలపడమే తన లక్ష్యమంతూ సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత మరో పాత ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు.
'ఇప్పుడు మెక్ డొనాల్డ్స్ కొనబోతున్నాను. అక్కడ అన్ని ఐస్ క్రీమ్ మెషీన్ లను పరిచయం చేయబోతున్నాను' అని రాసి ఉంది. ఈ ట్వీట్ ను షేర్ చేస్తూ అందరూ వినండి నేను అద్భుతాలు చేయలేను' అని క్యాప్షన్ ఇచ్చాడు.
ట్విట్టర్ లో యమ యాక్టివ్ గా ఉండే ఎలన్ మస్క్ చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు, కామెంట్లు చేస్తుంటారు. ట్విట్టర్ ను టేకోవర్ చేశాక ఇలాంటి ట్వీట్లతోనే సంచలనం సృష్టిస్తున్నాడు.
ఇక ట్విట్టర్ ను కొనేందుకు టెస్లా షేర్లను అమ్మకంపై కూడా ఆయన పోల్ నిర్వహించడం విశేషం. దానికి పాజిటివ్ గా స్పందన రావడంతో ఏకంగా 7 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను విక్రయించాడు.
ఇక ట్విట్టర్ కొనడానికి ముందు అందులో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని.. తాను అయితే ఎడిట్ బటన్ సహా అన్నింటిని మార్చేస్తాన్ని.. ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని నిరాశ్రయుల ఆశ్రమంగా మారుస్తానని ప్రకటించాడు. ఇప్పుడు ఏకంగా కోకాకోలాపై సరదాగా ట్వీట్ చేసినప్పటికీ తర్వాత మస్క్ ఏం చేస్తాడో చూడాలి.