సెలబెట్రీ విడాకుల పంచాయితీలో వేలు పెట్టిన ఎలన్ మస్క్

Update: 2022-05-28 12:30 GMT
ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూ అంటకాగుతూనే ఉంటాడు. అతడికి ఉన్న ఫాలోయింగ్.. అభిమానగణంతో ఇది ఇట్టే వైరల్ అవుతుంటుంది. తాజాగా ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ విమర్శల పాలైంది.

విబేధాలతో విడిపోయిన  హాలీవుడ్ సెలబ్రిటీ జంట జానీ డెప్-అంబర్ హర్డ్ కోర్టుకెక్కిన వ్యవహారంపై ఎలన్ మస్క్ బహిరంగంగా స్పందించడం వివాదామైంది. డెప్ హార్డ్ విడాకుల వ్యవహారంలో శుక్రవారం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేశారు.

ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఎలన్ మస్క్ ఓ ట్వీట్ చేశాడు. ఇద్దరూ ఉత్తమమైన వ్యక్తిత్వాలు ఉన్న అద్భుతమైన వ్యక్తులని.. వారిద్దరూ జీవితంలో ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టు ఓ ట్వీట్ చేశాడు. దీంతో కాపురంలో చిచ్చుపెట్టి ఇప్పుడు ఓదారుస్తున్నాడంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

డెప్ తన మాజీ టాలెంట్ మేనేజర్ అయిన క్రిస్టియన్ కార్నిన్నోకు పంపిన ఓ సందేశం వైరల్ అయ్యింది. అందులో అంబర్ హార్డ్-ఎలన్ మస్క్ మధ్య ఎఫైర్ గురించి ప్రస్తావన ఉండడం దుమారంరేపింది. అసభ్యమైన పదజాలంతో మస్క్ ను తిట్టాడు డెప్.

2015లో జానీ డెప్-అంబర్ హార్డ్ ల వివాహం జరిగింది. కానీ ఏడాదికే వాళ్ల కాపురంలో మనస్పర్ధలు చోటుచేసుకున్నారు. ఆ తర్వాత నటి అంబర్ హార్డ్ తో కొంతకాలం డేటింగ్ చేశాడు ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ తో తన భార్య అంబర్ డేటింగ్ తో వీరిమధ్య గొడవలు మరింత ముదిరాయన్నది జానీ డెప్ ఆరోపణ. అంబర్ కోర్టు ఫీజులను ఎలన్ మస్క్ చెల్లిస్తున్నాడని జానీ డెప్ ఆరోపిస్తున్నాడు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ఈ హాలీవుడ్ జంట భార్యభర్తలు ఒకరిపై ఒకరు పరువునష్టం దావా వేసుకొని వర్జీనియా కోర్టుకెక్కారు. నటనను పక్కనపెట్టి వ్యక్తిగత జీవితంతో బాగా డ్యామేజ్ చేసుకొని అభాసుపాలయ్యారు. ఈ జంట విడిపోవడానికి ఎలన్ మస్క్ కారణమని.. ఇప్పుడు వారు విడిపోవద్దని ఆయన చేసిన ట్వీట్ పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
Tags:    

Similar News