ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో ఒకరు, టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ గురించి తెలియనవారు ఉండరంటే అతిశయోక్తి కాదు. నిత్యం సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో ఆయన చురుగ్గా ఉంటారు. అంతేకాకుండా ఆయన చేసే ట్వీట్లతో కొన్ని కంపెనీల షేర్లు ఆకాశానికి దూసుకుపోతే.. మరికొన్ని పతనమవుతుంటాయి. ఆయన ట్వీట్లకు అంతటి శక్తి ఉంది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ఎలాన్ మస్క్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. 44 బిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో 3 లక్షల కోట్ల రూపాయలకు) కొనుగోలు చేస్తానని ముందుకొచ్చారు. మళ్లీ ఇంతలోనే ట్విట్టర్‌లో ఎన్నో ఫేక్ అకౌంట్లు, నకిలీ, స్పామ్ ఖాతాలున్నాయని.. ట్విట్టర్ నిర్వాహకులు తనకు ఈ విషయం చెప్పలేదని ఎలాన్ మస్క్ దాని కొనుగోలుకు మొండికేశారు. ట్విట్టర్ తన డేటా అంతా ఇస్తే తప్ప దాన్ని కొనుగోలు చేయబోయని తేల్చిచెప్పారు.
దీనిపై ట్విట్టర్ అమెరికాలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఇరువరి మధ్య పెద్ద వివాదమే నడిచింది. అయితే ఇంతలోనే కొద్దిరోజుల క్రితం మరోసారి ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని.. అయితే తాను ముందుగా ఆఫర్ చేసినట్టు 44 బిలియన్ డాలర్లకే కొంటానని స్పష్టం చేశారు. అక్టోబర్ 28లోగా డీల్ పూర్తిచేయాలని ట్విట్టర్ ప్రతినిధులు, ఎలాన్ మస్క్ యోచిస్తున్నారు. కారణం.. అక్టోబర్ 28 తర్వాత అయితే.. మళ్లీ విచారణ ఎదుర్కోవాల్సివస్తుందని న్యాయస్థానం చెప్పడమే.
అయితే ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు డీల్ పూర్తయితే ఆ సంస్థలో 75 శాతం ఉద్యోగులపై వేటు వేయనున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు అమెరికాలోని ప్రముఖ దినపత్రిక వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనాన్ని వెలువరించింది. ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలుకు ఉద్యుక్తులవుతున్న సమయంలో ఏకంగా 75 శాతం మంది ఉద్యోగులను ట్విట్టర్‌లో నుంచి తొలగిస్తారనే వార్త ప్రకంపనలు రేపుతోంది.
కంపెనీలోని 7,500 మంది కార్మికులలో దాదాపు 75 శాతం మందిని తొలగించాలని యోచిస్తున్న్డట్లు.. ఈ మేరకు కొనుగోలు డీల్‌లో కాబోయే పెట్టుబడిదారులతో ఎలాన్ మస్క్ చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొనడం గమనార్హం.
ఈ వార్తల నేపథ్యంలో ట్విట్టర్ స్పష్టత నిచ్చింది. ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని వెల్లడించింది. అసలు అలాంటి ప్రతిపాదన, ప్రణాళిక ఏమీ లేవని సిబ్బందికి తెలిపింది. ఈ మేరకు మెయిల్ ద్వారా ఉద్యోగులందరికీ వర్తమానం పంపింది.