భూమిని ఢీకొట్ట‌నున్నఎలాన్ మ‌స్క్ రోడ్ స్ట‌ర్ కారు

Update: 2018-02-17 17:30 GMT
 భూమిని ఢీకొట్ట‌నున్న ఎలాన్ మ‌స్క్ . అత‌ను గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే . త‌నకున్న అపార మేద‌స్సుతో అంత‌రిక్షంలో మాన‌వుడు ఇళ్లు క‌ట్టుకొని జీవ‌నం కొన‌సాగించాల‌నే అత‌ని ఆశ‌యం. ఆ ఆశ‌యం నెరవేర్చుకునే దిశ‌గా ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తున్నారు. అలా ప్రారంభ‌మైందే ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ. 2002లో ప్రారంభమైన ఈ కంపెనీ అనేక సంచ‌ల‌నాల‌కు శ్రీకారం చుట్టింది. ఆ సంచ‌ల‌నాల నుంచి వ‌చ్చిందే    రోడ్ స్ట‌ర్ కారు ప్ర‌యోగం న‌గ‌ర వీధుల్లో తిరిగే అత్యంత ఖ‌రీదైన రోడ్ స్ట‌ర్ కారు  భూమిని ఢీకొట్ట‌నుంది. ప్ర‌యోగాల్లో ఉప‌యోగించే రాకెట్ల‌ను త‌యారు చేసే  స్పేస్ ఎక్స్  (స్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌)  కంపెనీ గ‌త వారం ప‌రిశోధ‌న‌ల్లో భాగంగా రాకెట్ లో  రోడ్ స్ట‌ర్ కారును అమ‌ర్చి అంత‌రిక్షంలోకి పంపించింది. అలా వెళ్లిన ఈ కారు దాదాపు 10ల‌క్ష‌ల ఏళ్ల త‌రువాత భూమిని ఢీకొట్ట‌నుంద‌ని స్పేస్ ఎక్స్ సైంటిస్ట్ లు చెబుతున్నారు. అంత‌రిక్షంలో రోడ్ స్ట‌ర్ కారు భూమిని ఢీకొట్టే స‌మ‌యంలో ప్ర‌ళాయాలు ముంచుకొస్తాయ‌ని అంటున్నారు. మ‌రి మానవ మ‌నుగ‌డ క‌ష్టం క‌దా అని ప్ర‌శ్నిస్తే 10ల‌క్ష‌ల ఏళ్ల త‌రువాత భూమిపై ఏ జీవిరాశి ఉండ‌దని ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మ‌స్క్  అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

భూమిని ఢీకొట్టే ముందు కారు అంత‌రిక్షంలో తిరిగి తిరిగి అక్క‌డి నుంచి భూమిపై ప్ర‌యాణిస్తుంది. ఆ వేగానికి కారు మండి అగ్నిగోళం మారుతుంద‌ని రాయ‌ల్ ఆస్ట్ర నామిక‌ల్ సోసైటీ మేగ‌జైన్ లో ప్ర‌చురిత‌మైంది. ఈ ప్ర‌యోగానికి ఫాల్క‌న్ హెవీ అని నామ‌క‌ర‌ణం చేశారు. ఫాల్క‌న్ రాకెట్ కు మూడు ఫాల్క‌న్ - 9 రాకెట్ల‌ను జ‌త క‌లిపి ప్ర‌యోగించారు.  ఈ ప్రయోగంతో ఫాల్కన్ హెవీ ఇప్పటివరకు ఉన్న లాంఛ్ వెహికల్స్‌లో అత్యంత సామర్థ్యం కలిగిన రాకెట్‌గా మారింది. ఈ రాకెట్‌కు అత్యధికంగా 64 టన్నులు అంటే సుమారు ఐదు డబుల్ డెక్కర్ బస్సుల బరువును అంతరిక్షంలోకి మోసుకెళ్లే సామర్థ్యం ఉంది.ఈ ప్రయోగం ద్వారా ఎలాన్ మస్క్ తన టెస్లా స్పోర్ట్స్ కారును అంతరిక్షంలోకి పంపారు. ఆ కారులో స్పేస్ సూట్ ధరించిన ఒక డమ్మీని కూర్చోబెట్టారు

 ఈ ప్ర‌యోగానికి తొలి అడుగు ప‌డింది 2002 స్పేస్ ఎక్స్ నుంచి ప‌డింది.  రానున్న 100 సంవత్సరాల్లో అంగారక గ్రహం పై మనుషులు నివశించేందుకు గాను మానవ కాలనీలు నిర్మించాల‌న్న‌దే  ఎలాన్ మస్క్ కోరిక.  ప్రత్యేకమైన అంతరిక్ష వాహకనౌకల ద్వారా మానవులను అక్కడికి చేర్చటం జరుగుతుంది. మనుషులు తమ జీవితకాలంలో మరో గ్రహాన్ని సందర్శించడానికి ఇదో అరదుమైన అవకాశముని మస్క్ తెలిపారు. ఈ ప్రయాణపు ఖర్చు దాదాపుగా రూ.1.3 కోట్ల మేర ఉంటుందట. అలా ప్రారంభ‌మైన ఎలాన్ మ‌స్క్ అనే ప్ర‌యోగ‌శాల ఇప్ప‌టి వ‌ర‌కు 20 రాకెట్ లాంచర్లని అంత‌రిక్షంలోకి పంపిచారు.  వరసుగా 19 విజయవంతమయ్యాయి. జూన్ 2015లో నిర్వమించిన 20వ రాకెట్ లాంచర్ ఫెయిల్ అయ్యింది.

అయితే ఈ ప్ర‌యోగాల వ‌ల్ల ఎలాన్ మ‌స్క్ రోడ్డున పడాల్సి వ‌చ్చింది. 2008లో బ్యాంక్ అప్పుల్లో కూరుకుపోయిన ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీని 1.6 బిలియన్ డాలర్లు విలువ చేసే నాసా కాంట్రాక్ట్ కాపాడింది. అప్ప‌టి నుంచి నాసా కు త‌న ప్ర‌యోగం ద్వారా రాకెట్ల‌ను అందిస్తున్నాడు. ఈ ప్ర‌యోగంతో పాటు 2013లో ఎలాన్ మస్క్ ఓ విప్లవాత్మక ప్రాజెక్టు హైపర్‌లూప్. హైస్పీడ్ రైలు కన్నా మించిన వేగంతో ప్రయాణీంచే హైపర్‌లూప్ క్యాప్సూల్ అమెరికాలోని లాస్ ఏంజెలిస్ - శాన్‌ఫ్రాన్సిస్కోల మధ్య దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో అధిగమించగలదు.

అమెరికా ఎంటర్‌ప్రెన్యూర్, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన కొత్త రాకెట్ 'ఫాల్కన్ హెవీ'ని ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్ర‌యోగాల‌తో  నేడు అమెరికాలో నాసా త‌రువాత రెండో స్థానంలో ఉండ‌గా మిగిలిన ప‌రిశోధ‌న కేంద్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తున్నాడు ఈ అమెరిక‌న్ బిజినెస్ మ్యాన్
Tags:    

Similar News