ట్విట్టర్ వల్ల కరిగిపోతున్న ఎలన్ మస్క్ సంపద

Update: 2022-05-31 03:30 GMT
ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్. కానీ ఆయన నిర్ణయాల వల్ల ఇప్పుడు ఆయన సంపద ఆవిరైపోతోంది. స్వయంకృతాపరాధాలే దీనికి కారణం. ముఖ్యంగా మస్క్ సంపద కరిగిపోవడానికి కారణం మస్క్ నిర్ణయాలేనని చెబుతున్నారు. టెస్లా కంపెనీలో ఎలన్ మస్క్ వాటా 15.6 శాతం ఉండగా.. మొత్తం సంపద 122 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే స్టాక్ మార్కెట్ లో టెస్లా కారు షేర్లు ఈ ఏడాదిలో మొత్తం 37 శాతం నష్టపోయాయి.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ట్విట్టర్ ను 9.2 శాతం వాటాను కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లు టెస్లా పట్ల అతడి నిబద్ధతను ప్రశ్నించేలా చేసింది. దీంతో టెస్లా స్టాక్స్ పడిపోయాయి. ఆ తర్వాత మస్క్ సైతం ట్విట్టర్ ను 44 బిలియన్లకు టేకోవర్ చేసుకునేందుకు 8.4 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను మస్క్ అమ్మాడు. దీంతో మస్క్ సంపద కరిగిపోవడానికి పరోక్షంగా కారణమైంది.

ఎలన్ మస్క్ మాత్రమే కాదు.. బిలియనీర్లు జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ సంపద కూడా కరిగిపోతున్నట్లు  బ్లూంబర్గ్ తెలిపింది. గడిచిన 5 నెలల కాలంలో ఈ ముగ్గురు ధనవంతుల సంపద 115 బిలియన్ డాలర్లను నష్టపోయారు. వీరితోపాటు ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న జపాన్ లగ్జరీ గూడ్స్ కంపెనీ ఎల్ వీఎంహెచ్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ సైతం 44.7 బిలియన్ డాలర్లను కోల్పోయారు.

ట్విట్టర్ ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ తన సొంత కంపెనీ టెస్లాపై దృష్టి సారించడం లేదన్న ఆందోళన అందరిలోనూ వినిపించింది. ముఖ్యంగా ఆ కంపెనీలో మదుపు చేసిన వారు దీనిపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు. తమ వద్ద టెస్లా షేర్లను విక్రయించడం ద్వారా తమ నిరసన తెలియజేశారు.ట్విట్టర్ ను కొనుగోలుచేయడానికి టెస్లా షేర్లను ఎలన్ మస్క్ ఇటీవల అమ్మారు. దీంతో టెస్లా ప్రణాళికలు, లక్ష్యాలు దెబ్బతింటాయన్నది వారి ఆందోళన. ఈ పరిణామాల నేపథ్యలోనే టెస్లా షేర్లు ఇటీవల భారీగా పడిపోయాయి.

దీనిపై టెస్లా సీఈవోగా వ్యవహరిస్తున్న ఎలన్ మస్క్ తాజాగా స్పందించారు. టెస్లా 24/7 తన బుర్రలోనే ఉంటుందని వ్యాఖ్యానించారు. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారంపై తాను ఐదు శాతం కంటే తక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు.అదేమీ రాకెట్ సైన్స్ కాదని వ్యాఖ్యానించారు.  టెక్సాస్ లోని టెస్లా గిగా ఫ్యాక్టరీలో  స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగ కేంద్రం స్టార్ బేస్ లో తాను గడిపినట్లు ఎలన్ మస్క్ తెలిపారు.చాలా మంది తనను ఎలా అపార్థం చేసుకుంటున్నారో చెప్పడానికి వీలుగా ఒక సరదా చిత్రాన్ని ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. దీంతో టెస్లాను నిర్లక్ష్యం చేస్తున్నాన్న వాదనను కొట్టిపడేశారు.

తాజాగా ట్విట్టర్ డీల్ ను ఎలన్ మస్క్ హోల్డ్ లో పెట్టాడు. ట్విట్టర్ ఫాలోవర్లలో సగం మంది ఫేక్ అనే విషయాన్ని ఆన్ లైన్ ఆడిటింగ్ కంపెనీ స్పార్క్ టోరో తెలిపారు.  ట్విటర్ ఆడిటింగ్ టూల్ స్పార్క్‌టోరో ప్రకారం.. ఎలన్ మస్క్ కు ఉన్న 87.9 మిలియన్ల మంది పాలోవర్లలో  దాదాపు 48 శాతం మంది నకిలీ అని టైమ్ నివేదించింది.

ఇందులో స్పామ్ ఖాతాలు.. బాట్ ఖాతాలు ఉండి ఉండొచ్చని.. అదీ కాదంటే వారు ట్విట్టర్ ఖాతా చాలా రోజుల నుంచి వాడి ఉండరని తెలిపింది. ప్రస్తుతం మస్క్‌కి ట్విట్టర్‌లో దాదాపు 90 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.మస్క్ మాత్రమే కాదు.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు  బిల్ గేట్స్  ఫాలోవర్లు 58.4 మిలియన్లు మరియు మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా  ఫాలోవర్ల సంఖ్య మరియు 131.7 మిలియన్లలలో కూడా నకిలీలు ఉన్నారని తేల్చారు. బిల్ గేట్స్ ఖాతాలో 46 శాతం.. ఒబామా ఖాతాలో  44 శాతం మంది నకిలీ ఫాలోవర్లను కలిగి ఉన్నారని సంస్థ తేల్చింది. స్పామ్ నకిలీ ఖాతాల వల్ల ఈ సంస్థను కొనడం లేదని ఎలన్ మస్క్ తెలిపారు.
Tags:    

Similar News