ఎలన్ మస్క్.. టెస్లా కంపెనీ సీఈవోగా.. ప్రపంచంలో అత్యధిక సంపద కలిగి ఉన్న వ్యక్తిగా కొనసాగుతున్నాడు. అలాంటి వ్యక్తి మాములుగా ఎంత పన్ను కడుతాడన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అయితే మన సంపాదించే జీతాలకంటే మస్క్ కట్టే పన్నులు కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ అన్న విషయం ఇటీవల బయటపడింది. అదిప్పుడు సంచలనమైంది.
ఈ ఏడాది 11 బిలియన్ డాలర్లకు పైగా పన్నులు చెల్లించనున్నట్లు టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ సోమవారం ట్వీట్ చేశారు. ఇదే ఇప్పుడు సంచలనమైంది.
ఈ వారం ప్రారంభంలో డెమొక్రాటిక్ అమెరికా సెనేటర్ ఎలిజబెత్ వారెన్ తాజాగా ఎలన్ మస్క్ పై విమర్శలు గుప్పించారు. టైమ్ మ్యాగజైన్ మస్క్ ను "పర్సన్ ఆఫ్ ది ఇయర్"గా పేర్కొన్న తర్వాత మస్క్ పన్నులు చెల్లించాలని.. "అందరిని ఫ్రీలోడింగ్ చేయడాన్ని" ఆపాలని ట్విట్టర్‌లో డిమాండ్ చేశాడు.
దీనికి ప్రతిస్పందనగా, ఎలన్ మస్క్ ట్వీట్ చేస్తూ "మీరు 2 సెకన్ల పాటు మీ కళ్ళు తెరిచి ఉంటే, నేను ఈ సంవత్సరం చరిత్రలో ఏ అమెరికన్ కట్టని పన్నులు చెల్లించాను. అందరి కంటే ఎక్కువ పన్నులు చెల్లించాననే విషయాన్ని మీరు గ్రహించండి." అని పేర్కొన్నాడు.
మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అతని కంపెనీ టెస్లా విలువ సుమారు $1 ట్రిలియన్. గత కొన్ని వారాలుగా మస్క్ దాదాపు $14 బిలియన్ల టెస్లా షేర్లను విక్రయించారు. దాంతోనే ప్రపంచంలోనే ధనవంతుడిగా మారాడు.