కొన్నిసార్లు అంతే. కొన్ని పదాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. సాధారణ ప్రజలు పెద్దగా ఉపయోగించని కొన్ని పదాలు.. కొన్ని ఉదంతాల తర్వాత తరచూ వినియోగిస్తుంటారు. దిశ దారుణ ఉదంతం.. తర్వాత దిశ నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ మాటకు అభించిన ప్రాచుర్యం అంతా ఇంతా కాదు. సాధారణంగా ఏదైనా నేరం జరిగినప్పుడు.. అదెలా జరిగింది? అన్న విషయాన్ని నిందితులతో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
తాజాగా దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించిన సీన్ రీకన్‌స్ట్రక్షన్ ను నిర్వహించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సంచలనంగా మారిన దిశ దారుణం ఎలా జరిగిందన్న విషయాన్ని నిందితులతో కలిసి పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే ప్రయత్నంలోనే వారు పోలీసులపై దాడికి యత్నించి.. హెచ్చరిస్తున్నా వినకుండా పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతోవారిపై కాల్పులు జరపటంతో వారు మరణించారు.
ఈ ఎన్ కౌంటర్ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. దీంతో ఎన్ కౌంటర్ ఎలా సాగిందన్న విషయంపైన ఘటనా స్థలానికి ఎన్ హెచ్ఆర్సీ సభ్యుల బృందం వెళ్లింది. అక్కడ వారికి పోలీసులు ఎన్ కౌంటర్ ఎలా సాగిందన్న విషయాన్ని సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసి చూపించినట్లు తెలుస్తోంది. నిందితులు పోలీసులపై ఎలా దాడికి పాల్పడ్డారు? కర్రలతో.. రాళ్లతో ఎలా దాడి చేశారు? తుపాకులు ఎలా లాక్కున్నారు? ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎలా కాల్పులు జరిగిన వైనాన్ని వారు వివరించారు.
మొత్తానికి ఒక సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం వెళ్లిన పోలీసులు ఎన్ కౌంటర్ చేయాల్సి రావటమే కాదు.. మరో సీన్ రీకన్‌స్ట్రక్షన్ వివరణ కోసం కిందామీదా పడాల్సిన పరిస్థితికి ఎదురైందని చెప్పక తప్పదు.