అధికార‌ పార్టీలోనే మ‌ద్య నిషేధం డిమాండ్‌

Update: 2015-11-30 13:51 GMT
బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌ కుమార్‌ మ‌ద్య‌నిషేధాన్ని అమ‌లుచేయ‌నున్న‌ట్లు చేసిన ప్ర‌క‌ట‌న దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఎన్నిక‌ల హామీని నిల‌బెట్టుకోవ‌డంలో భాగంగా నితీశ్ కుమార్ వ‌చ్చే ఏడాది నుంచి మందుపై నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మిగ‌తా రాష్ర్టాల్లోనూ మ‌ద్య‌నిషేధం డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ప‌రిస్థితులు ఎక్క‌డికి దారితీశాయంటే ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే సీఎంకు లేఖ రాశారు.

మహారాష్ట్రలో మద్యాన్ని నిషేధించాలని అధికార భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆసిష్‌ దేశ్‌ముఖ్ ఆ రాష్ర్ట‌ ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్‌ కు లేఖ రాశారు. బీహర్‌ మద్యాన్ని నిషేధిస్తునట్లు ప్రకటించిన త‌ర్వాత ఈ డిమాండ్‌ రావడం విశేషం. సామాజిక విప్లవం రావాలనే దృష్టితో మహారాష్ట్రను మద్యరహిత రాష్ట్రంగా చేయ్యాలని తన లేఖలో ఆసిష్‌ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని వార్ధ - గచ్చిరొలి - చంద్రపూర్‌ జిల్లాలో నిషేదం అమల్లో ఉంది. 'ఇప్పటికే గుజరాత్‌ - నాగాలాండ్‌ - లక్ష్యద్వీప్‌ - మణిపూర్‌ లోని కొన్ని చొట్ల మద్య నిషేదం అమల్లో ఉంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ ఒకటి నుండి బీహార్‌ కూడా అమలు చేయనుంది, కేరళాలో కూడా ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. మద్యం అమ్మకాలను, వినియోగాన్ని నిషేదించి మహారాష్ట్రను కూడా మద్యరహిత రాష్ట్రంగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది సామాజిక విప్లవంలో ఫలితాలను ఇస్తుంది' అని దేశ్‌ముఖ్ లేఖ‌లో కోరారు.

ఇదిలాఉండ‌గా... రాష్ట్ర సామాజిక న్యాయ మరియు అబ్కారి శాఖ మంత్రి దిలీప్‌ కాంబ్లే ముంబైలో మ‌ద్యం అమ్మ‌కాలు, ఇత‌ర‌త్రా అంశాల‌పై సమావేశం నిర్వహించారు. అక్రమ మద్యం అమ్మకాలను, రవాణాను తనిఖీ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకొవాలని కఠినమైన అదేశాలను జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యన్ని నిషేదించే ఏ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని మంత్రి పేర్కొన్నారు. మద్యంపై నిషేదం విదిస్తే సంవత్సరానికి 18 వేల కోట్ల రెవెన్యూ లోటును రాష్ట్రం ఎదుర్కొవలసి ఉంటుందనీ, ఆదాయన్ని పెంచుకోడానికి ప్రత్యమ్నాయ వనరులు లేవని, అటువంటి పరిస్థితుల్లో ఈ డిమాండ్‌ అమోదించడం కుదరదని రెవెన్యూశాఖా మంత్రి ఎక్‌ నాథ్ ఖడ్సే తెలిపారు. మొత్తంగా ఖ‌జ‌నా నిండాలంటే ప‌న్నుల కంటే మందు ముద్దు అని అన్ని ప్ర‌భుత్వాలు బ‌లంగా భావిస్తున్న‌ట్లున్నాయి.
Tags:    

Similar News