రెండేళ్లలో ముక్కలైపోవటం ఖాయమంట

Update: 2015-04-13 17:11 GMT
తెలంగాణ అధికారపక్షంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తాజాగా విరుచుకుపడ్డారు. ఈ నెల 23న తెలంగాణలో నిర్వహించే తెలుగుదేశం పార్టీ బహిరంగ సభకు భారీ జరిపేందుకు ప్రయత్నించటం.. ఈ సందర్భంగా తెలుగుతమ్ముళ్లపై టీఆర్‌ఎస్‌ నేతలు విరుచుకుపడటం తెలిసిందే.

తెలంగాణ అధికారపక్షం నేతలు చేస్తున్న విమర్శలు.. వ్యాఖ్యలపై మండిపడిన ఎర్రబెల్లి.. టీఆర్‌ఎస్‌ పార్టీని భిన్న కోణంలో విమర్శలు చేశారు. తెలంగాణ అధికారపక్షంలో అంతర్గత పోరు సాగుతుందని.. రెండేళ్లలో పార్టీ ముక్కలైపోవటం ఖాయమని జోస్యం పలికారు. తెలంగాణలో కేసీఆర్‌ దుర్మార్గ పాలన సాగుతుందని తిట్టేసిన ఆయన.. పార్టీ ముక్కలైపోతుందని వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

తెలంగాణ అధికారపక్షం తిరుగులేని పవర్‌ను ఎంజాయ్‌ చేస్తున్న నేపథ్యంలో.. పార్టీ ముక్కలైపోవటం సాధ్యమే కాని పని. కానీ.. అదంతా చాలా సింఫుల్‌ అన్నట్లుగా ఎర్రబెల్లి చేస్తున్న వ్యాఖ్యలు చూసినప్పుడు.. కూసింత ఆశ్చర్యం కలగటం ఖాయం. రాజకీయ ప్రత్యర్థుల మీద విరుచుకుపడాలంటే.. కాస్తంత కష్టపడి నాలుగు మంచి లోపాల్ని ప్రజలకు చెప్పాలే కానీ.. ఇలా ముక్కలైపోతుంది.. విచ్ఛిన్నమవుతుంది లాంటి మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయం ఎర్రబెల్లికి ఎప్పుడు తెలుస్తోందో..?
Tags:    

Similar News