లత్కోరు, లంగా, లఫంగి, లుచ్చా...ఈ మాటలకు బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తాజాగా నల్లగొండ జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో ఇవే పదాలు ఉపయోగిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై, ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ బాషను చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.
పాస్ కోర్టు కేసులో ఇరుక్కున్నది, అమ్మాయిల సరఫరా కేసులో చిక్కింది కేసీఆరేనని ఆరోపించారు. ఆస్పత్రిలో దొంగ నిరాహారదీక్ష చేస్తే 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వారి మరణానికి కేసీఆర్ కారణమని అన్నారు. దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. 63 మంది ఎమ్మెల్యేలతో 5 ఎమ్మెల్సీ స్థానాలను ఎలా గెలుచుకున్నారని ప్రశ్నించారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో లఫంగి, లుచ్చా పనులు చేసింది.. చేసేది కేసీఆరేనని విమర్శించారు.
మొత్తంగా కేసీఆర్ ఒక్కమాట అంటే...మేం పది మాటలు అనేస్తాం అని ఎర్రబెల్లి చెప్పకనే చెప్పినట్లయింది.