తెలంగాణ సర్కారు సమాధానం ఏమిటి?

Update: 2015-06-08 08:59 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపు విషయంపై వివాదం చెలరేగుతుంది. ఈ టేపు నిజమైనది కాదని టీడీపీ వాదిస్తోంది. మరోవైపు.. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే దిశగా ఏసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇక.. విడుదలైన ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతు కాదని తెలుగుతమ్ముళ్లు వాదిస్తున్నారు. ఒకవేళ ఆడియో టేపులు నిజమైన పక్షంలో.. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి వాయిస్‌ను ఎలా ట్యాప్‌ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ఒక సూటి ప్రశ్న సంధించారు.

ఒకవేళ.. ఆడియో సీడీ నిజమైన పక్షంలో.. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్‌ని ఎలా ట్యాప్‌ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ టేపులు ఉంటే వాటిని కోర్టుకు ఇవ్వాలే తప్పించి.. మీడియాకు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. ఎర్రబెల్లి అడుగుతున్న ప్రశ్నలకు తెలంగాణ అధికారపక్షంలోని ఏ నేత సమాధానం చెబుతారో చూడాలి.


Tags:    

Similar News