హవ్వా.. ఇదేందయ్యా ఇదీ.. బీఆర్ఎస్ పేరు మరిచిపోయిన ఎర్రబెల్లి.. వీడియో వైరల్
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఓవైపు ప్రజల్లో చెరగని ముద్ర వేయాలని ‘బీఆర్ఎస్’ జాతీయ పార్టీకి తెగ ప్రచారం కల్పిస్తుంటే.. ఆయన మంత్రులకు కనీసం పార్టీ పేరు కూడా తెలియకపోవడం చూసి ప్రతిపక్షాలు ప్రజలు ఘోల్లుమంటున్నారు. ఆ వీడియోలను షేర్ చేసి మరీ ఎండగడుతున్నారు.
కేసీఆర్ తన పార్టీ పేరును మారుస్తూ ‘బీఆర్ఎస్’గా నామకరణం చేసి నిన్న దసరా రోజు హోరెత్తించారు. జాతీయ రాజకీయాల్లోకి దూకుడుగా ముందుకెళుతూ దేశంలో అధికార బీజేపీకి ప్రత్యామ్మాయంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. నిన్నటి కేసీఆర్ చర్యలు టీఆర్ఎస్ మంత్రులు, నేతలు తెగ హడావుడి చేశారు.
అయితే టీఆర్ఎస్ మంత్రులకే ఆ కొత్త పార్టీ గురించి కనీస అవగాహన లేకపోవడం.. తడబడుతూ చేసిన వ్యాఖ్యలు చూసి ఇప్పుడు అందరూ నోరెళ్లబెదుతున్న పరిస్థితి నెలకొంది. దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా తమ బాస్ కేసీఆర్ మార్చిన ‘బీఆర్ఎస్’ పార్టీ పేరును మర్చిపోవం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీ పేరు మరిచిపోయిన ఎర్రబెల్లి దాన్ని ‘బీఎస్పీ’ పెట్టారని వరంగల్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రి మాటలు విన్న వారు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘బీఎస్పీ’ పార్టీ మాయవతిది కదా? అని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఎర్రబెల్లి దసరా వేడుకల్లో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ కొత్త పార్టీతో అందరూ ప్రత్యర్థులు ఖతం కావాలని.. రావణాసురుడి దహనంతో అన్ని సమస్యలు పోతాయని.. కేసీఆర్, కేటీఆర్ సారథ్యంలో ముందుకు పోతున్నామని.. ఈయన ఏ పార్టీనో పెట్టిండ్లు కదనయ్యా.. ఏంటది.. ‘బీఎస్పీ’ కూడా జాతీయ పార్టీగా ప్రకటించారని శుభదినం’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎర్రబెల్లికి అసలు కేసీఆర్ మార్చిన పార్టీ పేరు కూడా తెలియకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఏ పార్టీ పెట్టిండయ్యా అంటూ జనాలను అడగడం.. దానికి ‘బీఎస్పీ’ అని జనాల నుంచి కొందరు సమాధానమిస్తే కనీసం ఆలోచించకుండా కేసీఆర్ పెట్టిన పార్టీ ‘బీఎస్పీ’ అంటూ ఎర్రబెల్లి అన్న వీడియో వైరల్ అవుతోంది. తెలంగాణ మంత్రులకే తమ పార్టీ పేరు మార్పు గురించి తెలియడం లేదని బీజేపీ, కాంగ్రెస్ లు దుమ్మెత్తి పోస్తున్నాయి. నెటిజన్లు సైతం ఎర్రబెల్లి వీడియో షేర్ చేసి మరీ ఎండగడుతున్న పరిస్థితి నెలకొంది.
బీఎస్పీకి, టీఆర్ఎస్ కు తేడా తెలియని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారాని వ్యంగ్యాస్థాలు సంధిస్తున్నారు. సొంత పార్టీ మంత్రులకే బీఆర్ఎస్ పేరు తెలియడం లేదని.. ఇక దేశ ప్రజలకు ఏం తెలుస్తుందని ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ ను జాతీయ నేతగా ప్రచారం చేస్తున్న మంత్రులు.. నేతలు ముందుగా కేసీఆర్ పెట్టిన పార్టీ పేరును గుర్తుంచుకోవాలని సలహా ఇస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

కేసీఆర్ జాతీయపార్టీ పేరు మర్చిపోయిన ఎర్రబెల్లి.. ఆ వీడియోతో టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు!!#errabellidayakarrao pic.twitter.com/QTPNxrmj2g
— oneindiatelugu (@oneindiatelugu) October 6, 2022