సింహాన్ని పెంచుకున్నాడు.. తర్వాత ఏమైందంటే..

Update: 2018-08-28 01:30 GMT
ఎవరైనా కుక్కను పెంచుకుంటారు.. పిల్లిని పెంచుకుంటారు.. కానీ వీళ్లెవరండీ బాబు.. ఏకంగా సింహాన్ని పెంచుకున్నారు. అల్లారు ముద్దుగా ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా పెంచుకున్న ఆ సింహాం ఓ రోజు అనుకోకుండా రోడ్ల మీదకు తప్పిపోయి వచ్చింది. దీంతో అంతపెద్ద సింహాన్ని చూసి కారులో వెళ్తున్నవారు.. స్థానికులు హడలి చచ్చారు. ఈ ఘటన కువైట్ దేశంలో చోటుచేసుకుంది.

గల్ఫ్ లోని కువైట్ దేశంలో ఓ పెద్ద సింహం నడిరోడ్డు మీద దర్శనం ఇచ్చింది. కబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సింహం జూ నుంచి తప్పించుకుంది కాదని.. ఎవరో రహస్యంగా ఇంట్లో పెంచుకుంటుందని గుర్తించారు. సింహాన్ని నడిరోడ్డుపై చూసిన జనాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సిబ్బంది సహాయంతో దానికి మత్తు మందు ఇచ్చి స్థానిక జూకు తరలించారు. సింహం రోడ్డు మీద హల్ చల్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కువైట్ లో క్రూర జంతువులను ఇళ్లల్లో పెంచుకోవడం నేరంగా పరిగణిస్తారు. ఇప్పుడు ఈ సింహం ఓనర్ కోసం అధికారులు వెతుకుతున్నారు. అతడి ఆచూకీ లభిస్తే దాదాపు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
    
వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News