ప్రస్తుతం పురుషాధిక్య సమాజమే అని చెప్పవచ్చు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న కూడా పురుషులదే పైచేయి ఉంటుంది. నేడు మహిళలకు అన్ని రకాల హక్కులు కల్పించినా అవి పూర్తి స్థాయిలో అమల్లోలేవని కఠిన సత్యం. ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. కాలక్రమేణా దానిని పితృస్వామ్య రాజ్యంగా మార్చారు. ఇక ఇక్కడ ఏం చేసినా కూడా పురుషులదే పైచేయి అన్నమాట. అందుకే పెళ్లిళ్ల నుంచి కర్మకాండల వరకు అన్నీ కుమారులే చేస్తారు. కానీ ఆ ప్రాంతంలో మాత్రం అన్నీ మహిళలే చేస్తారట. పెళ్లిళ్లు, కర్మకాండలు అన్నీ కూడా మహిళలే నిర్వహిస్తారట. ఇంతకీ అది ఎక్కడో తెలుసా?
మహిళలదే మొత్తం హవా ఉండే ప్రాంతం ఎక్కడంటే యూరప్ లోని ఎస్తోనియా దేశం. ఆ దేశంలో దాదాపు 200కు పైగా దీవులు ఉన్నాయి. వాటిలో ప్రత్యకమైన దీవి కిన్హూ దీవి. ఈ దీవిలో నివసించే వారి పద్ధతులు, అలవాట్లు చాలా భిన్నంగా ఉంటాయి. ఇకపోతే ఇక్కడ అందరూ మహిళలే ఉంటారు. వయసు పైబడిన వృద్ధులు, పిల్లలు మాత్రమే పురుషులు ఉంటారు. ఇక యవ్వన, వయోజన దశలో ఉన్న మగవాళ్లు కనిపించరు. అందుకే అక్కడ మహిళలదే సర్వాధికారం. ఏం చేసినా మహిళలే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే వ్యవసాయం, ఇంటి పనులు, పెళ్లి, పురుడు, కర్మకాండ ఇలా ప్రతీ తంతును ఆడవారే నిర్వహిస్తారు.
ఇంతకీ మగవాళ్లు ఏం చేస్తారనేదే మీ సందేహం కదా. వయసులో ఉన్న మగవారు చేపల వేటకు వెళ్తారు. ఉదయం వెళ్లి సాయంత్రం రావడం కాదు. నెలల తరబడ సముద్ర తీరప్రాంతాల్లోనే ఉంటారు. చేపల వేటనే వారి ప్రధాన వృత్తి. అందుకే ఇంటికి దూరంగా చేపల వేట కోసం ఉంటారు. ఇకపోతే అప్పడప్పుడూ ఇళ్లకు వెళ్లి తమ వారిని చూసుకుంటారు. ఇక ఇల్లు, పిల్లల బాధ్యత మొత్తం ఆడవారికే అప్పజెప్తారు. ఆ విధంగా ఇంటికి దూరంగా ఉంటూ చేపలు పట్టి జీవనోపాధి పొందుతారు.
కిన్హూ దీవిలో ఉండే ఈ ప్రత్యేకమైన ఆచారాలు కేవలం ఇప్పుడు పుట్టుకొచ్చినవి కావట. వందల ఏళ్లుగా ఇదే కొనసాగుతోందట. పురుషులు అక్కడ కనిపించడం చాలా అరుదు అంటు. ఆ విధంగా మహిళలే రాజ్యం. ఇకపోతే అక్కడి ఆడవారు కూడా పూర్తి బాధ్యతతో వ్యవహించి ఇంటిని, పిల్లలని చూసుకుంటారట. నిజానికి ఓ ఫ్యామిలీని లీడ్ చేయగలరు. అందుకే అక్కడ మహిళలకే పూర్తి బాధ్యతలు అప్పగించారు. అందుకే ఆ దీవిలో ఎక్కడ చూసినా ఆడవారే కనిపిస్తారు. మగవాళ్లు కనిపించడం అరుదు.