టీఆర్ఎస్ లోకి ఈటల.. కేసీఆర్ చర్చలు.. మంత్రి పదవి ఆఫర్?

Update: 2022-11-15 06:30 GMT
తెలంగాణ రాజకీయాల్లో ఇన్నాళ్లు బీజేపీ షాకులు ఇస్తుంటే టీఆర్ఎస్ భరించింది. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీల్లో టీఆర్ఎస్ ను ఓడించి బీజేపీ తొలి షాక్ ఇచ్చింది. ఇక మునుగోడులో మాత్రం టీఆర్ఎస్ తేరుకొని బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది.అనంతరం మొయినాబాద్ ఫాంహౌస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లతో బీజేపీని ఇరుకునపెట్టింది.

అయితే కేసీఆర్ రైట్ హ్యాండ్ అయిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించడం కేసీఆర్‌కు పెద్ద దెబ్బగా నాడు చెప్పొచ్చు. ఇది తెలంగాణ రాజకీయాల డైనమిక్స్‌ను మార్చిందనే చెప్పాలి. టిఆర్‌ఎస్‌ను బలహీనంగా.. బిజెపిని మార్చగలిగిన శక్తిగా అభివర్ణిస్తున్నారు.  హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచిన ఈటల టీఆర్‌ఎస్‌ ను నైతికంగా దెబ్బకొట్టారని చెప్పొచ్చు.

ఇక ఈటలను చేరికల కమిటీ చైర్మన్ ను బీజేపీ చేయడంతో ఈ ఫిరాయింపులకు ఊపు వచ్చింది.. ఈ  ఫిరాయింపులు మునుగోడు ఉప ఎన్నికలో కీలక పాత్ర పోషించాయి. ఈటల టీఆర్‌ఎస్‌కు ఘర్ వాపసీ చేసే అవకాశం ఉందని తాజాగా ఒక కథనం తెలంగాణ రాజకీయాల్లో సంచలనమవుతోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ మేరకు ఈటలతో చర్చలు జరిపాడని.. ఈ ప్రతిపాదనను కాదనలేని విధంగా చేయడంతో చర్చలు తుది దశలో ఉన్నాయని సమాచారం. బండి సంజయ్‌ వంటి వారి కారణంగా ఈటల రాజేందర్‌ బీజేపీతో సఖ్యంగా లేరని తెలుస్తోంది. ఇదే జరిగితే బీజేపీ నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, టీఆర్‌ఎస్‌ నుంచి ఫిరాయించాలని భావిస్తున్న వారు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని తెలుస్తోంది.

ఈటల అటువంటి ప్రణాళికలను తిరస్కరించినట్లు కూడా నివేదిక పేర్కొంది. అయితే ఇది కొన్ని కీలక చర్చలు జరుగుతున్నాయని.. అవి ఫలవంతం అయితే ఈటల ఖచ్చితంగా టీఆర్ఎస్ లో చేరుతారని అంటున్నారు. అయితే ఈటల మాత్రం టీఆర్ఎస్ లో చేరడానికి ఇష్టంగా లేడని అంటున్నారు. ఈ పత్రిక   నివేదికను నమ్మడానికి కఠినంగా కనిపిస్తున్నప్పటికీ.. కేసీఆర్ ఆఫర్ చేస్తే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చన్న చర్చ సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News