తెలంగాణలో వైరస్ అసలు కథ ఇప్పుడే మొదలైందట !

Update: 2020-05-30 11:10 GMT
తెలంగాణలో గతవారం రోజుల ముందువరకు కంట్రోల్ లోనే ఉందని అందరూ అనుకున్నారు. కానీ, వారం రోజులుగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యని చూస్తుంటే మళ్లీ వైరస్ విజృంభణ మొదలైందా అనే అనుమానం అందరిలో మొదలైంది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అసలు కథ ఇప్పుడే మొదలైంది అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

హుజూరాబాద్ పట్టణంలో సమగ్ర వ్యవసాయం - సుస్థిర వ్యవసాయం కార్యక్రమానికికి హాజరైన మంత్రి ప్రస్తుతం ఇతర దేశాల, రాష్ట్రాల నుండి ప్రజలు వస్తున్నందున వారికి ఎక్కువ శాతం కరోనా ఉన్నందు వలన పల్లెలు,పట్టణాలు క్షేమంగా ఉండే పరిస్థితి లేదని , వైరస్ ఇప్పుడే పోయేది కాదని ఆయన తెలిపారు. మొదటి రెండు నెలలు లాక్ డౌన్ విషయంలో సీరియస్ గా వ్యవహరించాం కాబట్టే కేసులు ఎక్కువ స్థాయిలో విస్తరించ లేదని, ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వైరస్ ను లైట్ గా తీసుకోవద్దు.. జూన్,జూలై నెలలో ఎక్కువగా కరోనా విస్తరించే అవకాశం ఉందని అన్నారు. కరోనను అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదన్న ఆయన, ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

ఏది సాధించాలన్న,ఏది శోధించాలన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమన్న ఈటెల వైరస్ అదుపులోకి వచ్చి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తి వేస్తే వచ్చే నెలలో ముఖ్యమంత్రి కెసిఆర్ ను హుజురాబాద్ నియోజక వర్గానికి తీసుక వస్తానని అన్నారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానానికి రైతులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, ఈ ఏడు 71 వేల ఎకరాల్లో తెలంగాణ రైతులు పంట పండించారని గుర్తు చేశారు. దేశంలో అందరికి తెలంగాణ రైతులు అన్నం పెడుతున్నారని. రాబోయే రోజుల్లో తెలంగాణ రైతులు ధనవంతులు కాబోతున్నారని మంత్రి ఈటల విశ్వాసం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News