టీడీపీతో బీజేపీ.. ఈటల రాజేందర్ రాజేసిన కుంపటి

Update: 2022-12-26 14:38 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో విస్తరించడం బీజేపీకి మేలు చేయడానికేనన్న వాదన తెరపైకి వచ్చింది. బీజేపీకి తెలంగాణలో సీట్లు తక్కువైతే మద్దతు ఇచ్చేందుకే బాబు రంగంలోకి దిగారని అంటున్నారు. తనకు పట్టున్న ఖమ్మం హైదరాబాద్ శివారు సీట్లలో పోటీచేసి గెలవాలని ప్లాన్ చేశారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు కోసం.. వచ్చే ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని పావులు కదుపుతున్నారని.. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి నస్టం జరుగుతుందని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుపై తీవ్రస్తాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే.  

తాజాగా బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ విషయంపై స్పందించారు. ‘బీజేపీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పార్టీ కాదని.. సొంతంగా బలపడే పార్టీ’ అని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు ఉందన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు ఖమ్మం సభపైన వ్యాఖ్యలు చేసిన ఆయన టీడీపీకి తెలంగాణ వాసన, పునాది రెండూ ఉన్నాయని.. టీడీపీ ఏమీ నిషేధించిన పార్టీ కాదని.. తెలుగుదేశం పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని గతంలో చంద్రబాబు కూడా చెప్పారని అన్నారు. ఆ పార్టీకి ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంతో టీడీపీకి సంబంధం ఉంది కాబట్టి చంద్రబాబు తెలంగాణలో సభలు పెడుతున్నారని ఈటల అన్నారు. తెలంగాణ రాష్ట్రంతో టీడీపీకి సంబంధం ఉంది కాబట్టి చంద్రబాబు తెలంగాణలో సభలు పెడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా గెలవబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం అని చెప్పిన ఈటల రాజేందర్ తాము ఏ పార్టీపైన ఆధారపడమని.. సొంతంగా బలోపేతం అవుతామని చెప్పుకొచ్చారు.

చంద్రబాబుపైన, ఖమ్మం సభపైన సానుకూలంగా మాట్లాడిన ఈటల రాజేందర్ వ్యవహారశైలి వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఖాయమా అన్న అనుమానాలకు ఆస్కారం ఇస్తుంది. చంద్రబాబు పార్టీ తెలంగాణలో కార్యక్రమాలు నిర్వహించుకోవడం తప్పేమీ కాదన్న ఈటల ఈ వ్యవహారంపై ఆచితూచి మాట్లాడారు. తాము ఎవరి మీద ఆధారపడడం అని చెప్తూనే చంద్రబాబు ఖమ్మం సభను సమర్థించారు. చంద్రబాబు సభపై ఈటల సానుకూలంగా మాట్లాడడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News