మాజీ మంత్రి, టీఆర్ ఎస్ మాజీ నాయకుడు.. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలుచేశారు. ``కేసీఆర్ వేస్ట్.. ఆయన బొమ్మతో ఎప్పుడూ నేను గెలవలేదు. ఎప్పుడైనా.. ఏ ఎన్నికైనా నాబొమ్మతోనే గెలిచా`` అని సంచలన కామెంట్లు చేశారు. స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిని కేసీఆర్ సహించరని ఈటల ఆరోపించారు.
పదవుల కోసం తెలంగాణ ఉద్యమంలో చేరలేదని ఉద్ఘాటించారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించాలని కేసీఆర్ కుట్ర పన్నారని ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై చేసిన విధంగానే ఇతర నేతలపైనా సీఎం ప్రయోగాలు చేశారని.. ఫలితంగా వారంతా ఓడిపోయారని.. తానొక్కడు మాత్రమే గెలిచానన్నారు. స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిని కేసీఆర్ సహించరని.. అతి విధేయంగా ఉండేవారినే నాయకుడిగా భావిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
``పదవుల కోసం నేను తెలంగాణ ఉద్యమంలో చేరలేదు. నేను ఎన్నికల్లో గెలిచింది కేసీఆర్ బొమ్మతో కాదు. నా సొంత పనీతీరుతోనే ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాను. స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిని కేసీఆర్ సహించరు. అతి విధేయతగా ఉండేవారినే కేసీఆర్ నాయకుడిగా భావిస్తారు. 2018 ఎన్నికల్లో నన్ను ఓడించాలని కేసీఆర్ కుట్ర పన్నారు.
మంత్రిగా ఉన్న నా ఇంట్లో ఎన్నికలప్పుడు పోలీసుల తనిఖీలు జరిగాయి. నాతో పాటు మరికొందరు టీఆర్ ఎస్ నేతలను ఓడించాలని చూశారు. వాళ్లంతా ఓడిపోయినా.. నేను మాత్రం ప్రజల అభిమానంతో గెలిచాను`` అని ఈటల వ్యాఖ్యానించారు.
కౌశిక్ రెడ్డి కౌంటర్..
ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరన్నారు. హుజురాబాద్‌లో ఈటలకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. సీఎం మీద కాదు హుజురాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలన్నారు. హుజురాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా ఈటలా అంటూ సవాల్ విసిరారు. ఉప ఎన్నిక తర్వాత హుజురాబాద్‌లో లక్ష రూపాయల అభివృద్ధి అయిన చేశారా అంటూ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.