దళితబంధును ఈటల రాజేందర్ లేఖ రాసి ఆపేశాడని టీఆర్ఎస్ హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తోంది. దీన్ని బీజేపీ ఎంత ఖండించినా లేఖల మీద లేఖలు రాసి నానా హంగామా చేస్తోంది. ఈ క్రమంలోనే దళితబంధును ఎవరో ఆపుతున్నట్టు టీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు.
కమలాపూర్ మండలం మర్రిపల్లిలో ఈటల రాజేందర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత్కాలికంగా నిజం ఓడిపోయినట్లుగా కనిపించవచ్చని.. నిజం నిప్పులాంటిదని తప్పుకుండా బయటకు వస్తుందన్నారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణలో 85శాతం దళిత బీసీలే ఉన్నారన్నారని.. దళితుడినే మొదటి సీఎం చేస్తానని.. మాట తప్పును అన్నారు. అవసరమైతే తల నరుక్కుంటానన్నారు. గతంలో దళితులను అవమానించి, గంజిలో ఈటలాగా కేసీఆర్ తీసేశారని..ఎప్పుడూ దళితులను మోసం చేస్తున్నది టీఆర్ఎస్ అంటూ విమర్శించారు.
దళితులకు సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నది టీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యానించారు. దళితులకు సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా మోసం చేశారని.. డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదని టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.. దళితబంధుతో మోసం చేస్తున్నారని ఎవరూ అనట్లే.. అహో.. ఓహో అంటున్నారని అన్నారు.. దళితులకు తప్పకుండా దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేసినా.. చేస్తున్నా కూడా అని ఈటల స్పష్టంచేశారు.
దళితబంధును ఎవరూ వద్దనడం లేదని.. కానీ పది లక్షలపై సంపూర్ణ అధికారం ఇవ్వాలంటున్నామని ఈటల అన్నారు. కేసీఆర్ తీరు మన కళ్లల్లో మట్టికొట్టి.. మన బతుకులను ఛిద్రం చేసినట్టు ఉందని అన్నారు.
కేసీఆర్ కు ఎప్పటికీ నేను, నా కొడుకు రాజ్యం.. పాలన ఉండాలనే తపన ఉందని ఈటల విమర్శించారు. 30 తర్వాత ఇక్కడి ప్రజాప్రతినిధుల బతుకు బజారుపాలేనని.. ఈటల వల్లనే వారికి డబ్బులు బిల్లులు వస్తున్నాయని తెలిపారు. టీఆర్ఎస్ నేతలను ఎవరూ పట్టించుకోరని ఈటల వ్యాఖ్యానించారు.