ఎయిర్ పోర్ట్ లో బాబుకు ఈటెల ఇన్విటేష‌న్‌

Update: 2017-06-09 05:52 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద‌ర్ క‌లిశారు. అయితే.. వీరిద్ద‌రి భేటీ ఎయిర్ పోర్ట్ లో కావ‌టం ఒక విశేష‌మైతే.. బాబును అంత అర్జెంట్ గా ఈటెల క‌లిసింది ఇన్విటేష‌న్ ఇవ్వ‌టానికి కావ‌టం మ‌రో విశేషంగా చెప్పొచ్చు.

తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా పిలుచుకునే ఈటెల రాజేంద‌ర్ కుమారుడు నితిన్ వివాహం ఈ నెల 18న హైద‌రాబాద్ హైటెక్స్ లో జ‌ర‌గ‌నుంది. పెళ్లివేడుక‌కు ఆహ్వానించేందుకు ఈటెల ఈ రోజు విజ‌య‌వాడ‌కు వెళ్లారు. అయితే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏరువాక కార్య‌క్ర‌మంలో భాగంగా అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్న విష‌యాన్ని తెలుసుకున్నారు.

దీంతో.. ఎయిర్ పోర్ట్ కు వ‌చ్చిన చంద్ర‌బాబుకు ఈటెల పెళ్లి ఇన్విటేష‌న్ ఇచ్చి.. వేడుక‌కు హాజ‌రు కావాల‌ని ఆహ్వానించారు. పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉన్న ఈటెల‌.. స‌మ‌యం లేనందునే గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ లోనే చంద్ర‌బాబుకు శుభ‌లేఖ‌ను ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News