కేసీఆర్, కవిత ఫ్యామిలీపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

Update: 2022-12-01 13:52 GMT
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో రావడంతో బీజేపీ దీన్ని అస్త్రంగా మలుచుకుంటోంది. ఇప్పటికే బీజేపీ ఎంపీ అరవింద్, బండిసంజయ్ సహా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే, ఒకప్పటి టీఆర్ఎస్ సహచరుడు అయిన ఈటల రాజేందర్ సైతం ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందని స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని తేల్చిచెప్పాడు.

తెలంగాణ చాలదన్నట్టు.. దోచుకోవడానికి ఢిల్లీ మీద కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం పడిందని ఆరోపించారు. కుట్రలకు కేరాఫ్ అడ్రస్ బీజేపీ కాదని.. కేసీఆర్ ప్రభుత్వమని ఈటల విమర్శించారు.  టీఆర్ఎస్ ను మట్టికరిపించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాల ఎమ్మెల్యేల కొనుగోలు సంస్కృతికి తెరతీసిందే కేసీఆర్ అని.. తెలంగాణ ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తుంది ఎవరు ? అని ఈటల రాజేందర్ నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో అతితక్కువ కాలంలోనే 870 కోట్ల రూపాయల వైట్ మనీ ఎలా వచ్చిందని కేసీఆర్ ను నిలదీశారు. ఉపాసం ఉన్న పార్టీ.. అటుకుల బుక్కిన పార్టీకి 8 సంవత్సరాల కాలంలోనే వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో తెలంగాణ ప్రజలందరూ ఆలోచన చేయాలని.. ఎవరికైనా డబ్బులు ఊరికినే ఇస్తారా? అని ఈటల రాజేందర్ నిలదీశారు.

గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద కానిస్టేబుల్ కిష్టయ్య 13వ వర్ధంతిని ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి రాజేందర్ తోపాటు ముదిరాజ్ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయనే ఈడీ, సీబీఐని కేంద్రంలోని బీజేపీ ప్రయోగిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించిన నేపథ్యంలోనే ఈటల రాజేందర్ స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో బీజేపీ విమర్శల వాడి పెంచింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News