ప్రపంచంలో ఎక్కడైనా కరోనాకు చికిత్స ఒక్కటే : మంత్రి ఈటల !

Update: 2020-09-07 08:50 GMT
కరోనా .. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. ఇది రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. ఇకపోతే తెలంగాణలో కొద్దిరోజుల క్రితం వరకు కొంచెం కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ , గత పది రోజుల నుండి మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ .... ఇప్పుడు కరోనా ప్రతీ ఇంట్లోకి వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చని, ఈ ధైర్యాన్ని ఆశ వర్కర్లు, ఏఎన్‌  ఎంలు ప్రజలందరికీ కల్పించాలని పిలుపునిచ్చారు.

ఇండియన్‌ ఇన్ ‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయంలో ఆదివారం 22 వేల మంది ఆశ వర్కర్లు, 500 మంది ఏఎన్‌ ఎంలతో ఆయన జూమ్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఈ ఆరు నెలల అనుభవంలో కరోనాకి చంపే శక్తిలేదని తెలిసిపోయిందన్నారు. 99 శాతం మంది కోలుకొని బయటపడుతున్నారన్నారు.

ప్రపంచంలో ఎక్కడైనా కరోనాకు చికిత్స ఒక్కటే అని అన్నారు. ఊరికే కార్పొరేట్‌ ఆసుపత్రు లకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్లాస్మా థెరపీ చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ వ్యక్తులను మొదటి రోజే గుర్తించగలిగితే వ్యాప్తిని అరికట్ట వచ్చని, ప్రాణాలు కాపాడవచ్చన్నారు. కరోనా రాష్ట్రంలోకి వచ్చిన మొదటి రోజు నుండి హెల్త్‌ వారియర్స్‌ కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. కిందిస్థాయిలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ కరోనాపై పూర్తి అవగాహన వచ్చిందన్నారు. ప్రజలను కూడా చైతన్యపరిచి అతి త్వరలో పూర్తిగా అడ్డుకట్టవేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇలాంటి వ్యాధులను ఎదుర్కోగలమని సీఎం కేసీఆర్‌ పదే పదే చెబుతున్నారని మంత్రి గుర్తుచేశారు.
Tags:    

Similar News