మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మరోసారి మంత్రి గంగుల కమలాకర్ నిప్పులు చెరిగారు. ఈటల రాజేందర్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు ఫిర్యాదులు చేశారని.. వెంటనే విచారణ జరిపి ఈటలను మంత్రివర్గం నుంచి తీసేశారని పేర్కొన్నారు.
ఇక తనపై విమర్శలు చేస్తున్న ఈటల వ్యాఖ్యలకు గంగుల కౌంటర్ ఇచ్చారు. హుజూరాబాద్ నాయకులను ప్రజాప్రతినిధులను డబ్బులు ఇచ్చి కొంటున్నారని అంటూ ఈటల అనడం బాధాకరమని గంగుల అన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరుఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు అమ్ముడుపోయారు అనడం బాధ కలిగిందన్నారు.టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారు ఎవ్వరూ అమ్ముడుపోరని.. గంగులకు వర్గం ఉండదు అందరూ టీఆర్ఎస్ వర్గం వాళ్లేనని మంత్రి గంగుల స్పష్టం చేశారు.
ఈటల కాంగ్రెస్, బీజేపీ వాళ్ల గడప తొక్కడంతోనే టీఆర్ఎస్ నేతలకు ఆయనపై నమ్మకం పోయిందని గంగుల అన్నారు. తర్వాతే వారంతా ఈటలను వదిలి టీఆర్ఎస్ లోనే ఉంటామని ప్రకటన చేశారని తెలిపారు. కేసీఆర్ బొమ్మ చూసి ఓట్లు పడ్డాయని.. అందుకే టీఆర్ఎస్ వెంటే ఉంటామని వారంతా వస్తున్నారని గంగుల తెలిపారు.
Full View