వైరస్ ను గెలిచిన 114 ఏళ్ల వృద్ధుడు.. అన్నిటికి సాక్షిగా నిలిచిన కురువృద్ధుడు
వైరస్ ప్రభావితం అతి తక్కువ ఉన్న దేశాల్లో ఇథియోపియా ఒకటి. వైరస్ వ్యాప్తి అడ్డుకట్ట చర్యలు తీవ్రంగా అమలుచేస్తుండడంతో వైరస్ కంట్రోల్ లోకి వచ్చింది. ఆ దేశంలో ఇప్పటివరకు 6 వేల లోపు పాజిటివ్ కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి. తాజాగా ఆ దేశంలో ఆసక్తికర పరిణామం జరిగింది. వైరస్ బారిన పండు ముసలి వ్యక్తి కోలుకోవడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
అతడి పేరు ఆబా తిలహన్ వోల్డేమైకేల్. అతడి వయసు 114 ఏళ్లు. వైరస్ కట్టడిలో భాగంగా అక్కడి అధికారులు దేశ రాజధాని అడిస్ అబాబాలో రాండమ్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆబా తిలహన్ ను కూడా పరీక్షించారు. ఫలితాల్లో అతడికి పాజిటివ్ వచ్చింది. వైరస్ లక్షణాలు కనిపించకముందే ఆయన్ను ఆస్పత్రిలో చేర్చించారు. అతడిని యెకా కెటెబే ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించారు.
వైరస్ బారినపడిన 80 ఏళ్ల పైవారు కోలుకోరని అన్ని అధ్యయనాల్లో తేలింది. అది వాస్తవం కూడా. కానీ దానికి భిన్నంగా ఆడిస్ అబాబా వైరస్ కు చికిత్స పొంది కోలుకున్నాడు. ప్రపంచంలో వైరస్ నుంచి కోలుకున్న వృద్ధుల అందరీలో ఈయనే పెద్దవారు. కోలుకున్న ఆబాను ఇప్పుడు ఇంట్లో ఉన్న మనవళ్లు చూసుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆబా మాట్లాడారు. తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు నా ఆరోగ్యం గురించి దేవుడిని ప్రార్థించానని తెలిపారు. దేశంలో అందరి ఆరోగ్యం కుదుటపడలాని నేను ఏడుస్తూ ప్రార్థించినట్లు చెప్పారు.
ఆబా యెకా కెటెబే ఆస్పత్రిలోని వైరస్ వార్డులో చికిత్స పొందారు. ఆస్పత్రిలో చేరిన నాలుగు రోజులకు అబా తిలహన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వైద్యులు తెలిపారు. దాంతో ఆయనకు ఆక్సిజన్ పెట్టడంతో కుదుటపడ్డారు. ఆయన ఆస్పత్రిలో మొత్తం 14 రోజులున్నారు. వారానికి పైగా ఆక్సిజన్ పెట్టారు. ఆయనకు యాంటీ బయాటిక్స్, విషమ పరిస్థితుల్లో ఉన్న కోవిడ్-19 రోగులకు సమర్థంగా పనిచేస్తుందని చెప్పుకుంటున్న యాంటీ ఇన్‌ఫ్లేమటరీ డ్రగ్ డెక్సామెథాసోన్ కూడా ఇచ్చారు. దీంతో అతడు విజయవంతంగా కోలుకుని ఇంటికి చేరారు.
అయితే ఆయన నడుస్తున్న ప్రపంచానికి సాక్షిగా నిలుస్తున్నారు. ఒక శతాబ్దం కాలాన్ని ఆయన కళ్లతో చూశారు. ఆయన యువకుడుగా ఉన్నప్పుడు దక్షిణ ఇథియోపియా నుంచి అడిస్ అబాబాకు వచ్చేశారు. కల్లోల సమయంలో అంతా అక్కడే గడిపారు. దేశంలో జరిగిన కీలక పరిణామాలకు సజీవ సాక్షిగా నిలిచారు.
1935-1945 మధ్య ఇటలీ ఆక్రమణ జరిగినప్పుడు, 1974లో చక్రవర్తి హైలే సెలాసీని పడగొట్టినపుడు, మార్క్సిస్టు డెర్గ్ పాలన 1991లో కుప్పకూలినప్పుడు, ఇప్పుడు తాజాగా కోవిడ్-19 మహమ్మారి వ్యాపించినపుడు నగరంలో కల్లోలాలన్నిటికీ సాక్షిగా నిలిచారు.
వాటిపై అక్కడి మీడియా అతడిని ఇంటర్య్వూలు చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఆ దేశంలో సెలబ్రిటీ అయ్యారు.