2 లక్షలు దాటినా నోటీసు గ్యారంటీ

Update: 2016-12-17 09:25 GMT
   
పెద్ద నోట్ల రద్దు తరువాత ఏ అకౌంట్లోనైనా 2.5 లక్షలు పడితే ఐటీ కన్ను వారిపై పడుతుంది.. నోట్ల రద్దు సమయంలోనే చెప్పిన సంగతి ఇది. దీంతో అంతా ఆ లిమిట్ దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఐటీ దెబ్బకు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ... కేంద్రం ఇప్పుడు మరో మెలికి పెట్టింది. అప్పుడు 2.5 లక్షల లిమిట్ పెట్టినా ఇప్పుడు దాన్ని 2 లక్షలకు తగ్గించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు అందాయట.
    
 నోట్ల రద్దు తర్వాత 2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన అకౌంట్లను పరిశీలిస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ... తాజాగా మాత్రం  ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో 2లక్షలు, ఆపై డిపాజిట్ చేసిన వారి ఖాతా వివరాలను తమకందించాలని ఆర్బీఐ  అన్ని బ్యాంకులను ఆదేశించింది.  ఈ మేరకు లిఖితపూర్వకంగా బ్యాంకులకు సందేశాలు అందాయి.
    
దీంతో దేశవ్యాప్తంగా ఎవరెవరి ఖాతాల్లో 2 లక్షలకు మించి డబ్బు డిపాజిట్ అయిందన్న వివరాలు ఐటీ శాఖకు చేరబోతున్నాయి.  అంటే వారందరికీ నోటీసులు అందడం గ్యారంటీ. అప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల్సి ఉంటుంది. ఆర్బీఐ ఇప్పటికే దీనిపై బ్యాంకులకు లేఖలు పంపించినా అధికారికంగా ఇంకా ఆదేశించలేదు... త్వరలో దీనిపైనా ప్రకటన వచ్చే సూచనలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News