ఒకింత సుదీర్ఘకాలం తర్వాత తెరమీదకు వచ్చిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. హిందుస్థాన్ లో నివసించే, హిందూమత సంప్రదాయాలను గౌరవించే వారంతా కూడా హిందువులేనని ఆయన పేర్కొన్నారు. ముస్లింలు ప్రార్థనలు చేసే తీరు వేరుగా ఉన్నప్పటికీ జాతీయత దృష్ట్యా వారు హిందువులేనని కూడా ఆయన అన్నారు. ‘హిందుస్థాన్ లో నివసించే, హిందూ సంప్రదాయాలను గౌరవించే వారంతా కూడా హిందువులే. ముస్లింలు ప్రార్థనలు చేసే విధానం వేరయినప్పటికీ జాతీయత దృష్ట్యా వారూ హిందువులే, హిందువులంతా కూడా హిందుస్థాన్ కు జవాబుదారీగా ఉండాలి. ఇంగ్లండ్ లో ఇంగ్లీషు వారు, అమెరికాలో అమెరికన్లు, జర్మనీలో జర్మన్లు ఉన్నట్టే... హిందుస్థాన్ లో హిందువులే నివసిస్తున్నారు' అని హిందూ సమ్మేళనంలో మాట్లాడుతూ భాగవత్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సమాజం హిందువులుగానే తెలుసునని, భారతీయులంతా హిందువులేనని, మనమంతా ఒకే సమాజమని ఆయన చెప్పారు. అందువల్ల తమ విభేదాలను మరిచి ఒకటిగా ఉండడం అవసరమని భాగవత్ అన్నారు.
అంతకు ముందు ఆయన బెటుల్ జిల్లా జైలును సందర్శించి ఆర్ ఎస్ ఎస్ రెండవ సర్ సంఘ్ చాలక్ దివంగత మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ అలియాస్ గురూజీకి నివాళులర్పించారు. 1948లో మహాత్మాగాంధీ హత్య అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించినప్పుడు గోల్వాల్కర్‌ను మూడు నెలల పాటు నిర్బంధించిన జైలులోని ఒకటో నంబరు బ్యారక్‌ను భాగవత్ సందర్శించారు. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపించాలనేది ప్రజలకు తెలుసునని భాగవత్ వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/