ఐపీఎల్ వేలం పూర్తైంది. రెండు రోజుల పాటు సాగిన ఈ వేలం మీదనే మీడియా ఫోకస్ అంతా. ఈ వేలం ప్రక్రియ పుణ్యమా అని ఇప్పటివరకు తెలీని చాలామందికి ఒక కొత్త లైఫ్ ఇవ్వటంతో పాటు.. రాత్రికి రాత్రిసెలబ్రిటీలుగా మారిపోయారు. ఆటగాళ్ల తీరు ఇలా ఉంటే.. వేలం జరిగే వేళలో.. ఆయా జట్లకు చెందిన యజమానులు.. వారి కోర్ టీంలు పెద్ద ఎత్తున వ్యూహరచన చేయటం తెలిసిందే.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆ వేలంలో పందొమ్మిదేళ్ల ఒక అమ్మాయి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డస్కీ బ్యూటీగా అందరి చూపు ఆమె మీదనే. ఆమె కళ్లలో తెలీని ఆకర్షణ అందరిని లాక్ చేసేలా చేయటమే కాదు.. వేలంలో చురుగ్గా పాల్గొన్న ఆమె ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారారు.
ఇంతకీ ఆమె ఎవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ నటి కమ్ కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని జూహ్లీచావ్లా కుమార్తె జాహ్నవి మెహ్తా. నిజానికి జాహ్నవిలో అందం కంటే తెలీని ఆకర్షణ చాలామందిని కట్టి పారేసింది. టీవీల్లో వేలం ప్రక్రియను చూసిన వారికి వెంటనే అర్థం కాలేదు కానీ..ఆరా తీసినప్పుడు ఆమె ఎవరన్నది అర్థమైంది. ఈ వేలం పాటకు బాలీవుడ్ బాద్షా షారుక్ కుమారుడు ఆర్యన్ తో పాటు ఉన్న జాహ్నవి మాత్రం అందరిని ఆకర్షించారు.
వయసు చిన్నదే అయినప్పటికీ.. వేలం ప్రక్రియ వేళ.. ఆమె చురుగ్గా పాల్గొన్న తీరు.. తల పండినవారితో పాటు తన ఆలోచనల్ని పంచుకోవటం చూసినప్పుడు తల్లికి తగ్గ కూతురుగా పలువురు అభివర్ణిస్తున్నారు.
విదేశాల్లో డిగ్రీ పూర్తి చేసి వచ్చిన ఆమె ప్రస్తుతం కేకేఆర్ వ్యవహారాల్ని చూస్తోంది. వాస్తవానికి రెండేళ్ల క్రితం జరిగిన ఐపీఎల్ వేలంలోనూ ఆమె పాల్గొంది. అప్పట్లో కూడా తల్లి జూహాచావ్లా తోడు లేకుండానే పాల్గొన్న ఆమె.. రెండోసారి మరింత చురుగ్గా వ్యవహరిస్తూ కెమేరాకు పెద్ద ఎత్తున పని చెప్పింది.