దాదాపు రెండేళ్లుగా ప్రపంచ జనుల్ని కరోనా కంగారు పెడుతుంది. ఎప్పుడు ఏ సమయంలో ఎలా దాడి చేస్తుందో తెలియక అందరూ భయం భయంగా జీవిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఒక రూపానికి వ్యాక్సిన్ కనుక్కుంటే మరో రూపంలో కంగారు పెడుతుంది. రెండో వేవ్స్ లలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని పెట్టుకున్న మహమ్మారి మూడో వేవ్ లో కూడా పంజా విసిరేందుకు సిద్ధమయింది. ఇప్పటికే మెక్సి దేశంలో థర్డ్ వేవ్ అడుగు పెట్టిందని నిపుణులు చెబుతున్నారు. మన దాయాది దేశం పాకిస్థాన్ లో ఏకంగా ఫోర్త్ వేవ్ కల్లోలం మామాలుగా లేదు. చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఆ దేశ అధికారులే ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉంచితే తాజాగా అమెరికాలో కూడా థర్డ్ వేవ్ భయం మొదలైంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన అమెరికాలో ప్రస్తుతం కరోనా రక్కసి కంగారు మామూలుగా లేదు. ఎంతలా అంటే గత 25 రోజుల్లో కొత్త కేసులు 350 మేర పెరిగాయి. వ్యాక్సినేషన్ భారీ స్థాయిలో పెరిగినా... కూడా గత 11 రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఆసియా ఖండంలోని మన పొరుగు దేశం ఇండోనేషియా పరిస్థితి కూడా దారుణంగా ఉంది. రోజురోజుకూ థర్డ్ వేవ్ బాధితుల సంఖ్య పెరుగుతూ పోతుంది. రోజుకు మూడు రెట్లు ఎక్కువగా కొత్త కేసులు వెలుగులోకి వస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇలా కరోనా ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది.
అమెరికా దేశంలోని 19 రాష్ట్రాల్లో కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య డబుల్ ఉంటుంది. లాస్ ఏంజిల్స్, దక్షిణ కాలిఫోర్నియాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేశాయి అక్కడి ప్రభుత్వాలు. పరిస్థితి ఇలాగే ఉంటే మరోమారు భారీ కల్లోలం తప్పేలా లేదని అందరూ భయపడుతున్నారు. మిన్నెసోటా యూనివర్సిటీ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం... ఈ థర్డ్ వేవ్ మూలాన దాదాపు 10 కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితం అవుతారని అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అంతకంటే ఎక్కువే మంది జనాలు ఈ కరోనా రక్కసి కోరల్లో చిక్కుకునేలా కనిపిస్తున్నారు. స్పెయిన్ దేశంలో సగానికి పైగా జనాభా కరోనా కోరల్లో చిక్కుకోవడం గమనార్హం. ఇక్కడ తొలిసారిగా రికార్డు స్థాయిలో 44 వేల కేసులు నమోదయ్యాయి.
ఇప్పుడున్న వేరియంట్లతో పాటు న్యూ బేటా అనే కొత్త రకం వేరియంట్ వెలుగు చూసింది. ఇది ప్రస్తుతం ఉన్న అన్ని వేరియంట్ల కంటే ప్రమాదం అని అందరూ భయపడుతున్నారు. దీని కారణంగా ఫ్రాన్స్ నుంచి వచ్చే వారిని చాలా దేశాలు నిషేధించాయి. ఆసియా ఖండంలో ఇండోనేషియా హాట్‌స్పాట్‌గా మారింది. ఇండోనేషియాలో ప్రస్తుతం మనకన్నా ఎక్కువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.మరో ఆసియా దేశం రష్యాలో డెల్టా వేరియంట్ కేసులు భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. అయినా సరే రష్యా వాసులు తాము వ్యాక్సినేషన్ వేయించుకోమని తేల్చి చెప్పేస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక జనాభా కరోనా కోరల్లో చికుకున్న దేశాల జాబితాలో రష్యా 5వ స్థానంలో ఉంది.