ఉప ఎన్నికల వేళ ప్రైవేటు వాహనంలో ఈవీఎం.. పట్టుకున్న బీజేపీ కాంగ్రెస్ నేతలు
హైటెన్షన్ వాతావరణంలో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసింది. ప్రలోభాలకు పరాకాష్ఠగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ కు ముందు ఉన్న టెన్షన్ వాతావరణానికి మించి.. పోలింగ్ తర్వాత కొనసాగింది. ఇదిలా ఉంటే.. పోలింగ్ పూర్తి అయి.. ఈవీఎంలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన వాహనంలో కాకుండా ప్రైవేటు వాహనంలో తీసుకురావటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించిన ఈవీఎంలను కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో భద్ర పరుస్తున్నారు. ఈవీఎంలను తీసుకొచ్చేందుకు ఆర్టీసీ బస్సుల్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఒక ఈవీఎంను మాత్రం ఆర్టీసీ బస్సులో కాకుండా ప్రైవేటు బస్సులో తీసుకురావటం వివాదంగా మారింది.
ప్రైవేటు బస్సులో తీసుకొచ్చిన ఈవీఎంపైన కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం కేటాయించిన వాహనంలో కాకుండా వేరే వాహనంలో ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. దీనికి బీజేపీ నేతలు సైతం సపోర్టు చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ కొత్త రచ్చకు తెర తీసింది. అయితే.. పోలింగ్ తర్వాత ఆర్టీసీ బస్సులోనే ఈవీఎంను తీసుకొని బయలుదేరినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వెల్లడించారు.
ఈవీఎంను తీసుకొస్తున్నఆర్టీసీ బస్సు టైరు పంక్చర్ కావటంతో.. జమ్మికుంట వద్ద బస్సును ఆపినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రైవేటు వాహనంలో ఈవీఎంను తరలించటంపైఅభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోల్ని సోషల్ మీడియాతో పాటు.. ఎన్నికల కమిషన్ కు సైతం పంపారు. ఈవీఎంను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి..చివరకు ఈ వివాదాన్నిఎలా క్లోజ్ చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.