ఈసారికి ఆ రెండు చోట్లా ఓటేస్తే రశీదు

Update: 2016-03-02 04:51 GMT
ఎన్నికల పోలింగ్ లో మరో అంకం మొదలు కానుంది. పోలింగ్ సంస్కరణలో భాగంగానే ఇటీవల కాలంలో చాలానే మార్పులు తీసుకొస్తున్న ఎన్నికల సంఘం.. ఎలాంటి ఆరోపణలు.. విమర్శలకు తావు లేకుండా చేసేలా ఎన్నికల్ని నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఒక కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నారు. ఓటు వేసిన ఓటరుకు ఓటేసిన రశీదుతో పాటు.. తాను వేసిన ఓటు ఏ పార్టీకి పడిందన్న విషయాన్ని చెక్ చేసుకునే అవకాశాన్ని ఓటరుకు కల్పించనున్నారు.

ఈవీఎంల ట్యాంపరింగ్ మీద తరచూ ఆరోపణలు రావటం.. ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు.. పార్టీలు ఈవీఎంల విశ్వనసీయత మీద సందేహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అలాంటి ఆరోపణలకు చెక్ చెప్పాలన్న ఆలోచనలో ఉన్న ఎన్నికల సంఘం అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసింది.

మరికొద్ద్ది రోజుల్లో జరిగే తెలంగాణలోని ఖమ్మం స్థానిక ఎన్నికల్లోనూ.. గుజరాత్ లోని గాంధీనగర్ సెగ్మెంట్ లోనూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు ప్రింటర్లను అనుసంధానం చేస్తున్నారు. దీంతో.. ఓటు వేసిన ఓటరుకు ఓటు వేసినట్లుగా రశీదు ఇవ్వనున్నారు. 2013లో సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం పేర్కొన్న విధంగా.. రశీదు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ఈ రెండు చోట్ల జరగనున్న ఎన్నికల్లో అమలు చేయనున్నారు.
Tags:    

Similar News