బ్రేకింగ్: బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎంలు

Update: 2021-04-02 07:48 GMT
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా అసోం రాష్ట్రంలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపు కోసం బీజేపీ నేతలు పక్కదారి పడుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపునకు అవకాశం ఉన్న రాష్ట్రం కేవలం అస్సాం మాత్రమే. అక్కడే బీజేపీ ఈ ఉపద్రవాలకు పాల్పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. వాటికి బలాన్ని ఇచ్చే సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది.

అసోంలో జరిగిన రెండో విడత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎంలను తరలించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆ పోలింగ్ బూత్ లో రీపోలింగ్ పెట్టాలని ఆదేశించింది. దీనికి బాధ్యులైన నలుగురు అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది.

ఈవీఎంలు ట్యాంపరింగ్ కాలేదని.. ఈసీ ప్రకటించింది. బీజేపీ ఓటమి భయంతో ఇలా చేస్తోందని.. సదురు అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించాలని అక్కడి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
Tags:    

Similar News