రాజకీయనాయకులు.. వారి వారసులకు పవర్ ఎంతగా తలకెక్కి ఉంటుందో తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న విషయాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించే ఈ తరహా నేతల్ని చూస్తే.. ఇలాంటి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న భావన కలుగక మానదు.
తన తండ్రి మాజీ ఎంపీ అయినప్పటికీ.. కొడుకు మాత్రం ఆకాశాన్ని ఊడిపడినట్లుగా ఫీలయ్యే తీరు చూస్తే.. ఇలాంటి వారి విషయంలో చట్టం కఠినంగా తన పని తాను చేసుకుపోవాలనిపించక మానదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ ఉదంతం బయటకు రావటంతో పాటు.. వైరల్ అవుతోంది. దీంతో ఉలిక్కి పడిన పోలీసులు ఇప్పుడీ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ జరిగిందేమంటే..
యూపీకి చెందిన బీఎస్పీ మాజీ ఎంపీ పుత్రరత్నం ఆశిష్ పాండే. అతగాడి తండ్రి పేరు రాకేశ్ పాండేగా చెబుతున్నారు. రెండు రోజల క్రితం (ఆదివారం) దక్షిణ ఢిల్లీలోని ఒక ఫైర్ స్టార్ హోటల్ కు వెళ్లాడు. కారు పార్కింగ్ చేసే సమయంలో తనకు అడ్డుగా ఉన్నారన్న ఒక జంటతో వాగ్వాదానికి దిగాడు. అయితే.. ఆ జంట కూడా అతగాడి దౌర్జన్యానికి బెదరక ప్రతిఘటించారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ఆశిష్ తన దగ్గర ఉన్న తుపాకీని బయటకు తీసి బెదిరించాడు. తనకు అడ్డు తప్పుకోకుంటే కాల్చేస్తానని హెచ్చరించాడు.
ఈ ఉదంతం మొత్తాన్ని చూస్తున్న ఒకరు తమ ఫోన్ లో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. మాజీ ఎంపీ కొడుకు తుపాకీతో బెదిరించిన ఉదంతంలో అక్కడి సెక్యూరిటీ గార్డు.. ఆ యువకుడి వెంట ఉన్న మహిళ ప్రతిఘటించే ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆశిష్ మహిళల బాత్రూంలోకి వస్తుంటే తాను అడ్డుకున్నందుకే తమపై ఇలా ప్రవర్తించినట్లుగా బాధిత మహిళ వాపోయింది. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై పోలీసులు స్పందించి ఆశిష్ పై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. ఎంత రాజకీయ నాయకుడి కొడుకైతే మాత్రం మరీ ఇంతలా బరితెగింపా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.