ఏపీ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కేంద్ర మాజీమంత్రి సాయి ప్రతాప్ తెలుగుదేశం గూటికి చేరారు. ఈ రోజు ఉదయం తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సాయిప్రతాప్ కడప జిల్లాకు చెందిన వారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు.
రాష్ట్ర విభజన అనంతరం సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినతీరును తీవ్రంగా వ్యతిరేకించిన సాయి ప్రతాప్ - ఇంతకాలం పార్టీ మారకపోయి నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సాయిప్రతాప్ ఒకదశలో వైసీపీలో చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరిగింది. అయితే ఆయన మాత్రం వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని ఆయన అనుచరులు తేల్చి చెప్పారు. కడప జిల్లాలో పార్టీ పటిష్టతపై ఇటీవల దృష్టిసారించిన టీడీపీ నాయకత్వం - సాయిప్రతాప్ ను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సాయిప్రతాప్ కూడా రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలో చేరినట్లు తెలుస్తోంది.
బలిజ సామాజికవర్గానికి చెందిన సాయి ప్రతాప్ చేరిక వల్ల కడప జిల్లా పరిధిలో, ముఖ్యంగా రాజంపేట లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ మేలు చేస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. గతంలో రాజంపేట లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన సాయిప్రతాప్ చేరిక వల్ల, లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని ఆయన అనుచరులు టీడీపీలో చేరే అవకాశాలున్నా యి. ఏపీలో ఉనికి కోసం తిప్పలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామమం మింగుపడని అంశమని రాజ కీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. గత కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ, ఆయన పార్టీ వీడుతారని తాము ఎప్పుడు భావించలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సాయిప్రతాప్‌లాంటి సౌమ్యుడైన నాయకుడు, ప్రస్తుత కష్టకాలంలో పార్టీ వీడడం ఇబ్బందికరమేనంటున్నారు.