ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ కోటకు బీటలు వారుతున్నాయి. అది కూడా పాతబస్తీలో కావడం గమనార్హం. దాదాపు 30 నుంచి 40 ఏళ్లగా సేవలు చేస్తున్న ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి జారుకుంటున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఒక్కటి కూడా జరగకపోవగా...తాజాగా అలాంటి కీలక ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఎంఐఎం పార్టీకి చెందిన కీలక నేత, మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్ మజ్లిస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను వేలాది మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించి ఆ మేరకు కండువా కప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గత కొంతకాలంగా పార్టీ తీరుపట్ల బిలాల్ గుర్రుగా ఉన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్నారు. పార్టీ తీరు నచ్చక రాజీనామా చేశారు. ఎంఐఎం పార్టీపై బిలాల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎంఐఎం పార్టీ పాతబస్తీ ప్రజల కోసం కాకుండా కేవలం వివాదాలను పెంచిపోషించి బతకాలని చూస్తుందని బిలాల్ ఆరోపించారు. తాను పాతబస్తీ నడిబొడ్డున నిలబడి సెక్యులరిజం జిందాబాద్ అని నినదించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అందుకే ఎంఐఎం పార్టీని వీడుతున్నట్టు వివరించారు. భారతమాత విషయంలో ఎంఐఎం పార్టీ వివాదాన్ని రేకెత్తించడం పట్ల బిలాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ బ్రదర్స్ తీరు పట్ల ఓల్డ్ సిటీలో ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని ఆయన చెప్పారు. సెక్యులరిజం పరిరక్షణ కోసమే తాను మజ్లిస్ పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. మజ్లీస్ పార్టీ మతాల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. మెట్రో రైలు ప్రాజెక్టు ఓల్డ్ సిటీలో రాకపోవడానికి ఎంఐఎం పార్టీనే కారణమన్నారు.
మాజీ ఎంపీ, పార్టీ అధ్యక్షులు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీకి జీవించి ఉన్న కాలంలో పార్టీలో అసంతృప్తులుంటే వారిని బుజ్జగించేవారు. ఆ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ కార్యకర్తల్ని విస్మరించి పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు పదవులు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సలావుద్దీన్ ఒవైసీకి వెన్నుముకగా ఉండి పార్టీకి సేవలు అందించిన మహ్మద్ పహెల్వాన్ వందలాది మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎస్ ఆర్ టీ కాలనీ మాజీ కార్పొరేటర్ మహ్మద్ బిలాల్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా మూడు నాలుగు సార్లు జీహెచ్ ఎంసీ కార్పొరేటర్లుగా పనిచేసిన అనుభవం ఉన్నవారు.
పాతబస్తీలో ఎంఐఎం పార్టీ దశాబ్దాల కాలంగా చక్రం తిప్పుతున్నది. ఆ పార్టీ చెప్పిందే పాతబస్తీలో చట్టం.. చేసిందే పాలన. ఆ పార్టీ అనేకంటే ఆ పార్టీ అగ్రనేతలు అసదుద్దీన్ ఓవైసి, అక్బరుద్దీన్ ఓవైసిలదే హవా. వారే అక్కడ అన్నీ. పాతబస్తీని కనుచూపుతోనే వారు శాసించే స్థితి ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతున్నది. వారి చేతుల నుంచి పాతబస్తీ జారిపోతున్న వాతావరణం నెలకొంది. సాధారణ ఎన్నికల సమయానికి ఇంకా అనేక మంది కాంగ్రెస్ - టీఆర్ ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.