మాజీ డీజీపీ మనమలు దుర్మరణం

Update: 2015-11-25 05:29 GMT
అంతులేని వేగంతో సాగే ప్రయాణం మరో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైంది. రింగ్ రోడ్డు మీద చోటు చేసుకునే రోడ్ యాక్సిడెంట్ల కారణంగా ప్రముఖులకు చెందిన పిల్లలు మరణించటం ఈ మధ్య ఎక్కువైంది. తాజాగా అలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పని చేసిన పేర్వారం రాములు మనమలు ఇద్దరు తాజాగా రోడ్డు యాక్సిండెట్ లో ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న పేర్వారం రాములు కుమార్తె ఇద్దరు కొడుకులు దారుణ రోడ్డు యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయారు. కోకాపేట పరిధిలోని ఒక ఫాంహౌస్ నుంచి ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ఘోరం చోటు చేసుకుందని చెబుతున్నారు. కోకాపేట వద్ద ముందుగా వెళుతున్న పాల వ్యాన్ ను వేగంగా పేర్వారం రాములు మనమలు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టటంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మనమలు (అరుణ్.. వరుణ్) దుర్మరణం పాలయ్యారు.

ఈ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే తీవ్ర గాయాలైన అరుణ్.. వరుణ్ లను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. వారు అప్పటికే మరణించినట్లుగా చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News