హైదరాబాదీ మాజీ బీజేపీ ఎమ్మెల్యేకు పాజిటివ్?

Update: 2020-06-01 04:30 GMT
అంతకంతకూ విస్తరిస్తున్న మందులేని మాయదారి రోగం ఇప్పుడు మరింతమందికి అంటుకొంటోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికి.. కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ సామాన్యులకే కానీ.. ప్రముఖులకు.. సెలబ్రిటీలకు పాజిటివ్ వచ్చింది లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక రాజకీయ ప్రముఖుడికి పాజిటివ్ గా తేలినట్లు చెబుతున్నారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన సదరు నేత.. అంతకు ముందు వరకూ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. విపక్షానికి చెందిన ఆయన.. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్ని తరచూ చేస్తుంటారని చెబుతారు. మిగిలిన నేతల మాదిరి సంచలన వ్యాఖ్యలకు దూరంగా ఉంటూ.. లోప్రొఫైల్ లోనే పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని చేపట్టిన ఆయన.. మొన్నటి ఎన్నికల్లోనూ గెలిచే అవకాశం ఉందని భావించారు. అయినప్పటికీ.. ఆయన ఓడిపోయారు.

ఓటమిపాలైన తర్వాత కూడా తాను నిర్వహించే సేవా కార్యక్రమాల్ని ఆపకుండా కంటిన్యూ చేస్తున్న సదరు నేత.. గడిచిన వారంలోనూ కొన్ని కార్యక్రమాల్ని చేపట్టినట్లు చెబుతున్నారు. తాను పోటీ చేసే నియోజకవర్గం పరిధిలోని పేదలకు సాయం అందించే విషయంలో చురుగ్గా వ్యవహరించిన ఆయన.. గడిచిన కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నట్లు చెబుతున్నారు.

తనకు ఎట్టి పరిస్థితుల్లో మాయదారి రోగం అంటదనే ధీమాతో ఉండే ఆయనకు తాజాగా పాజిటివ్ గా తేలినట్లు తెలుస్తోంది. అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. ఆయనకు పాజిటివ్ గా తేలటంలో నగరంలోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన సన్నిహితులు పాజిటివ్ అంశాన్ని అనధికారికంగా కన్ఫర్మ్ చేస్తున్నారు. అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో.. అధికారిక ప్రకటన వెల్లడయ్యేంతవరకూ వెయిట్ చేయాలని చెబుతున్నారు.  ఇప్పటివరకూ వినిపిస్తున్న వార్త నిజమే అయితే.. హైదరాబాద్ లో పాజిటివ్ గా వచ్చిన తొలి ప్రముఖుడు ఆయనే అవుతారని చెబుతున్నారు.
Tags:    

Similar News