అరడజను మంది సరిహద్దులు దాటారంట

Update: 2016-03-23 16:47 GMT
దేశంలో మరో ఉగ్రదాడికి ప్లాన్ చేశారా? దేశ ప్రజలంతా హోలీ సంబరాల్లో మునిగిపోయిన వేళ.. సమయం చూసుకొని మరీ దేశ సరిహద్దుల్ని గుట్టుచప్పుడు దాటేశారా? పాకిస్థాన్ నుంచి దొంగచాటుగా దేశంలోని ప్రవేశించిన ఉగ్రవాదుల కారణంగా దేశ రాజధానికి ఉగ్రవాద దాడి ముప్పు ఉందా? అంటే అవునని చెబుతున్నాయి నిఘా సంస్థలు.

దేశం మొత్తం హోలీ వేడుకల్లో బిజీగా ఉన్న సమయంలో ఆరుగురు ఉగ్రవాదులు పాక్ నుంచి భారత్ సరిహద్దుల్ని దాటేశారని చెబుతున్నారు. ఈ బృందానికి ఒక మాజీ ఆర్మీ అధికారి నాయకత్వం వహిస్తున్నారని చెబుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. దేశంలోని చొరబడ్డారని భావిస్తున్న ఉగ్రవాదుల కారణంగా.. దేశ రాజధాని ఢిల్లీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

కొద్ది నెలల కిందట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పఠాన్ కోట్ సరిహద్దు ప్రాంతం నుంచే తాజాగా చొరబాట్లు కూడా జరిగి ఉంటాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలతో తనిఖీల్ని ముమ్మరం చేశారు.
Tags:    

Similar News