ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన సీక్రెట్ ఆపరేషన్స్ లో అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టటం. తన ఉగ్రదాడితో వందలాది అమెరికన్లను పొట్టనబెట్టుకున్నఅతని కోసం ప్రపంచం మొత్తం జల్లెడ వేసి.. చివరకు అతన్ని మట్టుబెట్టే వరకూ వదిలిపెట్టని వైనం. ట్విన్ టవర్స్ దాడి అనంతరం అతడ్ని పట్టుకోవటం కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. తన సర్వశక్తులు ఒడ్డి.. అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా దేనికైనా సిద్దమన్నట్లు వ్యవహరించింది.
విపరీతమైన వ్యయ.. ప్రయాసల అనంతరం లాడెన్ పాక్ భూభాగంలో తలదాచుకున్నట్లుగా తెలుసుకొని.. ఒక రహస్య ఆపరేష్ ద్వారా లాడెన్ నుమట్టుబెట్టారు. అమెరికాకు చెందిన అత్యుత్తమ నేవీ సీల్ బృందం ఈ సీక్రెట్ ఆపరేషన్ చేసినట్లుగా చెప్పుకొన్నారు. భద్రత పరంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ఇప్పటివరకూ వారికిసంబంధించిన వివరాలు బయట పెట్టలేదు.
అయితే.. ఈ రహస్య ఆపరేషన్ లో పాల్గొని.. లాడెన్ తలలోకి బుల్లెట్లు దింపినట్లుగా తనకుతాను చెప్పుకుంటున్న రాబర్ట్ ఓనీల్ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
తాజాగా అతడు.. "ద ఆపరేటర్: ఫఐరింగ్ ది షాట్స్ దట్ కిల్ల్ డ్ బిన్ లాడెన్" పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. ఇందులో.. లాడెన్ ను మట్టు పెట్టేందుకు తామేం చేసిందన్న విషయంతో పాటు.. లాడెన్ ను తాను ఎలా చంపానన్న విషయాన్ని వివరంగా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఏం జరిగిందన్నది నేవీ సీల్ షూటర్ రాబర్ట్ మాటల్లోనే చూస్తే..
"అమెరికాపై లాడెన్ జరిపిన 9/11దాడులకు ప్రతీకారంగా అతడ్ని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాం. అమెరికా నేవీకి చెందిన ఆరుగురు సభ్యుల సీల్ కమెండో బృందం ఈ ఆపరేషన్ లో పాల్గొంది. పాక్ లోని అబోటాబాద్ లోని లాడెన్ స్థావరానికి వెళ్లాం. లాడెన్ కాంపౌండ్ లో రెండో అంతస్తులో లాడెన్ కొడుకు ఖలీద్ ఏకే 47తో ఉన్నాడు. మాలో ఒక కమాండో అరబిక్ లో ఖలీద్.. ఇటు రా అని పిలిచారు. ఏమిటి? అంటూ బదులిచ్చాడు. అతడి మాటను విన్న వెంటనే.. ఆ వైపునకు గురి చూసి ఖలీద్ ను చంపేశాం"
"పై అంతస్తులో లాడెన్ ఉన్నాడని అర్థమై అక్కడికి వెళ్లాం. పై అంతస్తులో ఉన్న లాడెన్ ను గురి పెట్టగా.. తన చిన్న భార్య అమల్ ను మానవ రక్షక కవచంగా వాడుకున్నాడు. ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. గురి చూసి రెండుసార్లు కాల్చేశా. అంతే.. బుల్లెట్లు లాడెన్ తల రెండు ముక్కలైంది. వెంటనే మరో బుల్లెట్ దింపా. అంతే.. లాడెన్ తల ముక్కలు ముక్కలైంది. ఆ ముక్కల్ని ఒకచోటకు చేర్చి సరిపోల్చుకున్నాం" అంటూ నాటి సంగతుల్ని చెప్పుకొచ్చాడు. లాడెన్ అభిమానించేవారి గుండెలు మండేలా చెప్పిన ఈ మాటలు రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయన్నది సందేహం కలగక మానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/