కరోనా మహమ్మారితో అత్యధికంగా నష్టపోయిన రంగాల్లో విద్యారంగం ప్రథమ స్థానంలో ఉంటుంది. చాలా మంది విద్యార్థులు వరుసగా రెండు విద్యా సంవత్సరాలు నష్టపోయారు. ఆన్ క్లాసులు అంటూ నడిపించినప్పటికీ అది ఎండాకాలం చదువుల్లాగానే మిగిలిపోయాయి. మొన్నామధ్య విద్యాసంస్థలు ఓపెన్ చేసినప్పటికీ.. సెకండ్ వేవ్ విజృంభించడంతో.. మరోసారి మూతపడ్డాయి. హైస్కూల్ స్థాయి విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంటే.. ఉన్నత విద్య చదువుతున్న వారి పరిస్థితి మరో విధంగా ఉంది.
ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడిపోయాయి. అన్ని సెట్లూ పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు కొవిడ్ తీవ్రత తగ్గుతుండడంతో.. అన్ని పరీక్షలూ నిర్వహించేందుకు రూట్ క్లియర్ చేస్తోంది ఉన్నత విద్యామండలి. నెల రోజుల గ్యాప్ లో అన్నీ సిద్ధం చేసుకొని ఆగస్టు నుంచి ప్రవేశ పరీక్షలన్నీ వరుసగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
వాస్తవానికి జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ.. అది సాధ్యం కాలేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 5 నుంచి 9 మధ్య ఈ పరీక్ష నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా.. ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్.. 23న లాసెట్, పీజీఎల్ సెట్.. 24, 25 తేదీల్లో ఎడ్ సెట్ యథాతథంగా నిర్వహించాలని చూస్తున్నట్టు సమాచారం.
ఇదేవిధంగా ఈసెట్ ను ఆగస్టు 3న, ఎంటెక్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ ఈసెట్ ను ఆగస్టు 11 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోందని సమాచారం.