డ్రగ్స్ కేసు: రేవంత్‌రెడ్డి పిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ

Update: 2020-12-17 16:33 GMT
తెలంగాణలో డ్రగ్స్ కేసులు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ను ఎంత షేక్ చేశాయో తెలిసిందే.. చాలా మంది సినీ,రాజకీయ ప్రముఖులు ఇందులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే తర్వాత కేసీఆర్ సర్కార్ డ్రగ్స్ కేసును నీరుగార్చిందన్న అపవాదును తెచ్చుకుంది.

డ్రగ్స్ కేసులు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి పిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులపై హైకోర్టుకు ఎక్సైజ్‌శాఖ నివేదిక సమర్పించింది. డ్రగ్స్ కేసులను దర్యాప్తు చేసే అధికారం కేంద్ర సంస్థలతో పాటు తమకూ ఉందని ఎక్సైజ్ శాఖ తెలిపింది.

2017లో నమోదైన 12 డ్రగ్స్ కేసుల దర్యాప్తు పూర్తయిందని.. కేంద్ర సంస్థలకు అప్పగించాల్సిన అవసరం లేదని ఎక్సైజ్‌శాఖ స్పష్టం చేసింది. ఎక్సైజ్‌శాఖ తమకు డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వడం లేదని ఈడీ ఆరోపించింది.

ఎక్సైజ్‌శాఖ నివేదికపై అభ్యంతరాలను సమర్పించేందుకు రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాది రచనారెడ్డి గడువు కోరారు. దీంతో డ్రగ్స్ కేసు విచారణ రెండు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది.
Tags:    

Similar News