సిట్ దర్యాప్తు హాట్ హాట్ గా సాగినంత కాలమూ.. సినిమా పరిశ్రమ వారంతా ఒకటే గగ్గోలు పెట్టారు. సినీ రంగం సెలబ్రిటీలు గనుక, విచారణకు కూడా క్రేజ్ వస్తుంది గనుక.. తమ పేర్లు బయటపెట్టారని , అందరి పేర్లు బయటపెట్టలేదని వారు ఆవేదన చెందారు. నిజానికి సిట్ వ్యవహరిస్తున్న తీరు కూడా వారి ఆవేదనకు తగ్గట్లుగానే ఉంది. సినీ సెలబ్స్ డజను మంది పూర్తయిన తర్వాత.. సిట్ ఇప్పటికి చాలా పెద్ద సంఖ్యలో ఐటీరంగానికి చెందిన సాఫ్ట్ వేర్ నిపుణులను విచారించింది. వారిలో చాలా మందినుంచి బ్లడ్ ఇతర శాంపిల్స్ ను కూడా ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం తీసుకున్నారు. కాకపోతే.. ఏ ఒక్కరి పేరు గానీ వివరం గానీ బయటపెట్టలేదు. చాలా గుంభనంగా నడిపించేస్తున్నారు.
నిజానికి ఏయే ఐటీ కంపెనీలలో డ్రగ్స్ తీసుకునే వారు ఎంతెంత మంది ఉన్నారో సమాజానికి తెలియడం చాలా అవసరం! ఎందుకంటే.. తమ పిల్లలకు అలాంటి కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినా చేర్చకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారు. కానీ సిట్ అధికారులు ఆ పేర్లను ఎందుకు దాచిపెట్టారో అర్థం కావడం లేదు. సినిమా రంగం వాళ్లు డ్రగ్స్ వాడుతున్నట్లు తెలియగానే వారి పేర్లను బయటపెట్టి నోటీసులు ఇచ్చి.. బీభత్సమైన పబ్లిసిటీ తో విచారణ పర్వం నడిపించడం మొత్తం ఎందుకు చేసినట్లు?
ఇప్పుడు డ్రగ్స్-ఐటీ కంపెనీల పేర్లను మాత్రం దాచిపెట్టి బ్రాండ్ హైదరాబాద్ ఇమేజిని కాపాడే ప్రయత్నం అని చెబుతున్నారు. అయితే ఇన్నాళ్లూ తాము చేసింది సినిమా రంగం పరువు తీయడం కాదా? అని పోలీసులు తమ చర్యలను ఓసారి పునస్సమీక్షించుకోవాలి. ఆ మాటకొస్తే సమాజానికి ఎవరి పేర్లు బయటకు రావడం వల్ల మేలు జరుగుతుంది. పూరీ జగన్నాధ్ డ్రగ్స్ తీసుకుంటాడు అని తేలితే.. మహా అయితే ఆయన దగ్గర ఓ పదిమంది అసిస్టెంట్లు, మరో పది మంది కీలక టెక్నీషియన్లు పనిచేస్తారు. ఇరవై మందికి మించి ఆ వ్యసనానికి అలవాటు పడే అవకాశం లేదు. కానీ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ డ్రగ్స్ మయంగా ఉన్నదని తేలితే.. ఏటా కొన్ని వందల మంది ఆ ఊబిలోకి ఉద్యోగాల రూపంలో ప్రవేశిస్తూ ఉంటారు. మరి ఆ కంపెనీల పేర్లు బయటపెట్టకుండా.. సిట్ పోలీసు అధికారులు ఎవరిని కాపాడదలచుకున్నట్లు? హైదరాబాదు ఇమేజిని కాపాడుతున్నారా.. ? లేదా సాఫ్ట్ వేర్ కంపెనీల వ్యాపారాన్ని కాపాడుతున్నారా? వారు ఆలోచించాలి. ఈ గోప్యత అనేది ఇప్పడే తమకు అర్థమైన సంగతి అని వారు అనవచ్చు.. కానీ సినీ సెలెబ్స్ విషయంలో కక్షతో చేసినట్లుగా కాకుండా.. వారి పట్ల కూడా ఇకమీదటైనా ఇదే గోప్యత పాటిస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.