తలారి పవన్ ఫ్యామిలీ గురించి తెలిస్తే వణకాల్సిందేనట!

Update: 2019-12-13 11:10 GMT
57 ఏళ్ల పవన్ జల్లాద్ గురించి అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేరు. గూగుల్ ను అడిగినా తెల్లముఖం వేసే పరిస్థితి. ఇటీవల తెర మీదకు వచ్చిన ఆయన ఒక్కసారిగాపాపులర్ అయ్యారు. దేశం మొత్తాన్ని కదిలించిన నిర్భయ దోషులకు ఉరి వేసేందుకు మీరట్ జైలు అధికారులు తీహార్ కు పంపుతూ నిర్ణయం తీసుకోవటంతో ఆయన పేరు.. ఫోటోలు మీడియాలో పెద్ద ఎత్తున టెలికాస్ట్ అయ్యాయి.

దీంతో.. గూగుల్ ను సైతం పేరును టైప్ చేస్తే.. ఇప్పుడు సమాధానం వస్తోంది. ఇంతకీ పవన్ ఫ్యామిలీ గ్రౌండ్ ఏమిటి? ఇవాల్టి రోజున ఇలాంటి పని ఎందుకు చేసుకుంటున్నారన్న విషయాల్ని చూస్తే.. పవన్ మాత్రమే కాదు.. ఆయన తండ్రి.. తాత.. ముత్తాత అందరూ జైల్లో తలారీ పని చేసిన వారే కావటం గమనార్హం.

పవన్ కుటుంబానికి చెందిన నాలుగు తరాల వారు తలారిగా పని చేసిన వారేనన్నారు. యూపీ ప్రభుత్వం అనుమతి ఇస్తే నిర్భయ దోషులను తాను ఉరితీస్తానని చెబుతున్నాడు. ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లి తన డ్యూటీని చేస్తానని చెప్పారు. ఉరిశిక్ష వేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పవన్ పాత కుటుంబంలో ఒక చెత్త రికార్డు కూడా ఉంది. అదేమంటే.. బ్రిటీష్ వారి పాలన సమయంలో దేశ భక్తుడైన భగత్ సింగ్ ను ఉరి తీశారు పవన్ ముత్తాత లక్ష్మణ్. ఇక.. పవన్ తాత విషయానికి వస్తే కరుడుగట్టిన దొంగలైన రంగా బిల్లాలను ఉరి తీసిన ఘన చరిత్ర లక్ష్మణ్ తాతకు ఉంది. చివరకు ఇందిరమ్మ హంతకుల్ని సైతం పవన్ తాతే ఉరి తీశారు.

తర్వాతి రోజుల్లో పవన్ తండ్రి మీరట్ జైల్లో తలారీగా ని చేశారు. 2013లో తండ్రి మరణం అనంతరం పవన్ ను యూపీ జైళ్ల శాఖ తలారీగా నియమించింది. తనకు తలారీ ఉద్యోగమంటే ఎంతో ఇష్టమని చెప్పే పవన్.. తన కొడుకును మాత్రం తలారీగా కొనసాగించనని చెప్పారు. గతంలో తనకు రూ.3వేలు స్టైఫండ్ గా ఇచ్చేవారని.. దాన్ని రూ.5వేలకు పెంచినట్లు చెప్పారు. తనతో తన కుటుంబంలో తలారీ పని చేసే వైనం ఆగిపోవాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
Tags:    

Similar News