ఈ లెక్క చూస్తే బీజేపీ ఖేల్ ఖతమేనా?

Update: 2019-05-18 10:24 GMT
కేంద్రంలో అధికారంలోకి రావాలంటే రహదారి ఉత్తరప్రదేశ్. ఈ ఒక్క రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేస్తే చాలు కేంద్రంలో ఈజీగా అధికారంలోకి రావచ్చు. యూపీలో ఏకంగా 80 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. యూపీ నుంచి విడదీసిన ఉత్తరఖండ్ లో 5 సీట్లున్నాయి. మొత్తం ఉమ్మడి యూపీలో సీరియస్ గా కాన్ సెనట్రేషన్ చేస్తే చాలు కేంద్రంలో అధికారానికి కావాల్సిన మూడింట ఒకవంతు సీట్లను ఈ రాష్ట్రమే అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

పోయిన 2014 ఎన్నికల్లో ఆర్ ఎస్ ఎస్ - బీజేపీ - అమిత్ షా.. బీజేపీ సైన్యమంతా ఉత్తరప్రదేశ్ లో మకాం వేసి మొత్తం 80 సీట్లకు గాను 72 సీట్లను కొల్లగొట్టారు. కేంద్రంలో ఈజీగా ఎలాంటి పొత్తులకు ఆస్కారం లేకుండా ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు.

అయితే 2019 వచ్చేసరికి యూపీలో సీన్ రివర్స్ అయ్యింది. ముఖ్యమంత్రి అయిన యోగి ఆధిత్యనాథ్ హిందుత్వ చర్యలు - మైనార్టీ వర్గాలకు కోపం తెప్పించాయి. అదే సమయంలో గోవధ నిషేధం సహా రౌడీల పేరుతో అక్రమ అరెస్టులు - నిర్బంధాలు - దళితులపై దాడులు ఇలా సంక్షేమం - అభివృద్ధి పక్కకుపోయి రాష్ట్రంలో ఆదిపత్య రాజకీయాలు కొనసాగాయి. అభివృద్ధిపై ఆశతో బీజేపీని గెలిపించిన యూపీ ప్రజలు ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి...

కీలకమైన యూపీపై  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  ఫుల్ కాన్ సన్ ట్రేషన్ చేశాడు. తన చెల్లి ప్రియాంకగాంధీని రంగంలోకి దింపాడు. యూపీలోనే మకాం వేసిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అక్కడ బీజేపీ సీట్లకు బొక్క పెట్టినట్టు సమాచారం.

యూపీలో ఎస్సీ-బీఎస్సీ కూటమితోపాటు కాంగ్రెస్ కూడా మెజార్టీ సీట్లను చేజిక్కుంచుకుంటందని జాతీయ మీడియా సంస్థల సర్వేలో తేలినట్టు సమాచారం. ఎగ్జిట్ పోల్స్  విడుదల చేయడానికి పూనుకున్న జాతీయ చానెళ్లకు యూపీలో బీజేపీ ఖేల్ ఖతమైనట్టు రిపోర్టు వచ్చినట్టు తెలిసింది. ఎస్పీ -బీఎస్సీ కూటమికి  45 సీట్లకు పైగా వస్తాయని.. కాంగ్రెస్ కు 23 సీట్లకు పైగా వస్తాయని తేలిందట..బీజేపీకి కేవలం 10-15 లోపే సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో వచ్చిందట.. దీన్నిబట్టి యూపీలో బీజేపీ ఖేల్ ఖతమైనట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పోయిన సారి ఇదే యూపీలో మొత్తం 80 సీట్లకు బీజేపీ 72 సీట్లు సాధించి కేంద్రంలో అధికారం కొల్లగొట్టింది. ఇప్పుడు కేవలం 15 లోపే సీట్లు వస్తాయని అన్ని ఎగ్జిట్ పోల్స్ లో సర్వే సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ - రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - చత్తీస్ ఘడ్ లలో బీజేపీకి సీట్లు రావడం కష్టమే. ఇక రైతుల ఆందోళనలతో మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి తీసికట్టుగా ఉంది. దక్షిణాదిన బీజేపీకి 10 సీట్లకు మించి రావంటున్నారు. ఒడిషా - బెంగాల్ - బీహార్ - ఈశాన్యంపై మాత్రమే బీజేపీ ఆశలు పెంచుకుంది. ఈ లెక్కలన్నీ చూస్తే ఈ సారి బీజేపీకి కేంద్రంలో అధికారం కల్ల అనే అనుమానాలైతే బలపడుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

    

Tags:    

Similar News